38.2 C
Hyderabad
April 27, 2024 16: 33 PM
Slider వరంగల్

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

#sridevi

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని ములుగు ఎంపీపీ  గండ్ర కోట శ్రీదేవి అన్నారు. గురువారం సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి జిల్లా కేంద్రంలోని తమ ఇంట్లో బతుకమ్మ ని పేర్చి బతుకమ్మ (గౌరమ్మ)కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ  ముందుగా ములుగు మండల  ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

ఆమె మాట్లాడుతూ బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో లేదా నీటి నదీ ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి ,భయం,చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ అని బతుకమ్మ గొప్పతనాన్ని తెలియజేశారు.

Related posts

గరుడ వాహనంపై సీతాపతి……

Satyam NEWS

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందచేసిన ఆర్య వైశ్య సంఘం

Satyam NEWS

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Satyam NEWS

Leave a Comment