40.2 C
Hyderabad
May 2, 2024 15: 59 PM
Slider తూర్పుగోదావరి

చెడు వ్యసనాలకు బానిసలై మోటార్ సైకిళ చోరి

#kottapeta

చెడు వ్యసనాలకు బానిసలై మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు రావులపాలెం సీఐ రజనీ కుమార్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,  కొత్తపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మండలం పరిధిలోని కొత్తపేట బాబులు కాలనీ చెందిన నలుగురు యువకులు పవన్ కుమార్, తరుణ తేజ, శ్రీరామమూర్తి, అవినాష్ వ్యసనాలకు బానిసలయ్యారన్నారు. జల్సాలు చేయడం కోసం ఏడాది నుంచి బైక్ లను దొంగలిస్తున్నారని చెప్పారు. దీంతో ఆ నలుగురు యువకులను ఎస్సై వి. మణికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కొత్తపేట గోగివారిపేట వద్ద మంగళవారం అరెస్టు చేశారని చెప్పారు. వారి వద్ద నుంచి 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.ఈ  నలుగురు యువకులను కొత్తపేట కోర్టు లో హాజరు పరుస్తామని తెలిపారు.

Related posts

భూములను ఆక్రమించానని రుజువు చేస్తే నామినేషన్ వేయను…!

Satyam NEWS

కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతయినా వుంది

Satyam NEWS

రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూకు ఘనంగా ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment