38.2 C
Hyderabad
April 29, 2024 22: 43 PM
Slider సినిమా

రియల్ యాక్టర్స్:’మా’గుట్టు మాకే ఎరుక!!!

maa telugu

‘మా’లో మాకు లుకలుకలు. ఇది ఎవరో బయటి వాళ్ళు చెబుతున్న మాట కాదు. మా అసోసియేషన్‌ కార్యవర్గం చెబుతున్న మాట. నిజంగానే ఇప్పుడు మా అసోసియేషన్‌ లో ఏదీ సవ్యంగా జరగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఇది కేవలం భ్రమ మాత్రమే.. పైపైన అందరూ కావాలని సృష్టిస్తున్న వార్తలు అనుకున్నారు.

అసలు తెర వెనక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అసలు కథ నరేష్‌ ప్రమాణస్వీకారం రోజునుంచే మొదలయింది.. మా అధ్యక్షుడిగా ఎంపికైన కాసేపటికే మా అసోసియేషన్‌ లో ఉన్న లొసుగులు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఒకరిపై ఒకరికి ఎంత కోపం ఉందో.. ఒకరంటే ఒకరు దగ్గరగా ఉంటూ ఎంత దూరంగా ఉంటున్నారో మా ప్రమాణ స్వీకారోత్సవంలో బట్టబయలు అయిపోయింది. అయితే మా అధ్యక్షుడు నరేష్‌ తీరుపై మిగిలిన కార్యవర్గ సభ్యులు కూడా ఎప్పటినుంచో చాలా అసంతృప్తితో ఉన్నారు.

ఒకానొక సమావేశంలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నరేష్‌ తీరును తప్పు పట్టాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నేను చేశాను.. నేనే చేశాను.. అంటూ ప్రతిదీ తానొక్కడే చేసినట్లు నరేష్‌ చెప్పుకోవడం రాజశేఖర్‌కు అస్సలు నచ్చలేదు. దాంతో అందరి ముందు ఆయన నరేష్‌ మాట తీరును అప్పట్లోనే తప్పు పట్టాడు రాజశేఖర్‌.

ఇదే సమయంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి వైస్‌ ప్రెసిడెంట్‌గా గెలిచిన హేమ కూడా నరేష్‌ తీరును తీవ్రంగా తప్పు పట్టింది. ఆమె మాట్లాడుతుంటే మైక్‌ లాక్కోవడంపై చాలా సీరియస్‌ అయింది అప్పట్లో ఈ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. ఇవన్నీ ఇలా ఉంటే సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతున్నప్పుడు నరేష్‌ వెళ్లి ఆయన చెవిలో స్పీచ్‌ అపమని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

ఒక సీనియర్‌ నటుడిని గౌరవించాల్సిన తీరు ఇదేనా అంటూ నరేష్‌ పై నిప్పులు చెరిగారు విశ్లేషకులు. ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత కాలంలో నరేష్‌ ఇంకెలా మారిపోతాడో అంటూ ఆయనపై విమర్శలు సైతం వచ్చాయి. ఈ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇండస్ట్రీలో చాలా చెడ్డ పేరు మూటగట్టుకోవలసి వస్తుందని కొందరు బాహాటంగానే అప్పట్లో హెచ్చరించారు.

ఏదేమైనా మా అసోసియేషన్‌ లొసుగులు బయటపడటంతో శివాజీ రాజా ప్యానల్‌ ఉన్నప్పుడే బాగుండేది అంటూ కొందరు ఇప్పటికీ భావించేవారు లేకపోలేదు. కాగా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో మరో సందర్భంలో లుకలుకలు బయటపడ్డాయి. మా ప్రెసిడెంట్‌ నరేష్‌పై ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి జీవితలు తీవ్రంగా మండిపడ్డారు.

ప్రెసిడెంట్‌ అయినప్పటి నుంచి నరేష్‌.. చేసిందేమి లేదంటూ ఆరోపించారు జీవితా రాజశేఖర్‌లు. నరేష్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పదవిలో వచ్చినప్పటి నుంచి ఫండ్‌ రైజింగ్‌ కూడా చేసిందేమి లేదంటూ ఫైరయ్యారు. అంతే కాకుండా.. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు.

దీంతో వీరి మధ్య ఎప్పటినుంచో కాలంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌) తరచూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ‘మా’ ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్‌, నరేష్‌లు ప్యానల్‌లు ప్రతిష్టాత్మకంగా భావించటంతో ఆ ఎన్నికల జనరల్‌ ఎలక్షన్స్‌ను తలపించాయి. అయితే అనూహ్యంగా నరేష్‌ ప్యానల్‌ విజయం సాధించటంతో కొద్ది రోజుల పాటు గత కమిటీపై ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగాయి.

అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో ‘మా’ అసోషియేషన్‌లో మరో వివాదం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకే ప్యానల్‌ నుంచి పోటీ చేసిన నరేష్‌, జీవిత రాజశేఖర్‌ల మధ్య ఇప్పుడు గొడవ రాజుకుంది. అధ్యక్షుడు నరేష్‌ లేకుండానే ఎక్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, సెక్రటరీ జీవితలు జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు.

అత్యవసర సమావేశం జరుగుతుంది అంటూ సభ్యులకు మెసేజ్‌ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకపోవటంతో ఆయన తరపు న్యాయవాది స్పదించారు. అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్‌ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు.

అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్‌, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ మాత్రమే.. కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదన్నారు. ఆ మీటింగ్‌లో అప్పటికి తొమ్మిది నెలలకాలంలో అధ్యక్షుడిగా పనిచేసిన నరేష్‌ తీసుకున్న నిర్ణయాలపై చర్చించడం గమనార్హం. ఇక అప్పట్లో థర్టీ ఇయర్స్‌ ఇండష్ట్రీ పృధ్వీ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ప్రెసిండెంట్‌ ఆఫ్‌ ఇండియాలా ఫీలవుతున్నారు.

అందరూ కలసి పనిచేయండి. ఈసీ సభ్యులు 26 మంది ఉన్నారు. ఒక్కొక్కరూ పది మందిని దత్తత తీసుకుని తలా కొంచెం ఇవ్వండి. సమస్యల్లో ఉన్న వాళ్ల బాగోగులు చూడాలి కానీ ఇవేం గొడవలు. అత్యవసర సమావేశం అని తిరుపతి నుంచి వస్తే ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 400 సినిమాలకు రచయితగా పని చేసిన మా గురువు పరుచూరి గోపాలకష్ణని కూడా మాట్లాడనివ్వలేదు. ఆయన సమస్కారం పెట్టినా అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా బాధాకరం. నాకు ఈసీ మెంబర్‌ పదవి అక్కర్లేదు. ‘మా’ తీరు మారకుంటే రాజీనామా చేస్తా. ఈసీ మెంబర్‌గా గెలిచినందుకు ఆనందపడాలో.. బాధపడాలో తెలియడం. ‘మా’లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారు. మెంబర్లు కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Related posts

ఎస్ బి ఐ లోకి చొరబడ్డ దొంగలు: లాకర్ నుంచి సొమ్ము చోరీ

Satyam NEWS

ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS

మత మౌఢ్యం ముదిరి… ‘తల దాచుకున్న’ మానవత్వం

Satyam NEWS

Leave a Comment