30.2 C
Hyderabad
May 13, 2024 13: 55 PM
Slider నెల్లూరు

లోకేష్ పాదయాత్ర పై ఎంపీ ఆదాల ఆసక్తికర వ్యాఖ్యలు

#Lokesh Padayatra

తెలుగుదేశం అగ్ర నేతలు చంద్రబాబు, లోకేష్ లు వర్షాకాలంలో పాదయాత్రలు ఆపితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి చమత్కరించారు. మా వైసీపీ మంత్రి ఒకరు ఇదే విషయాన్ని నిన్న మాట్లాడారని, నేను కూడా ఆయనతో ఏకీభవిస్తున్నానని సరదాగా వ్యాఖ్యలు చేశారు. వారు పాదయాత్రలు కొనసాగిస్తే సకాలంలో వర్షాలు పడకపోతే డ్యాములు ఒట్టిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 31,29 డివిజన్లలో పైప్లైన్, రోడ్డు నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ ఆరు నెలల్లో అధికారంలోకి వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయని కితాబునిచ్చారు.వీరు మరింతగా కృషి చేసి మరింత మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 31 డివిజన్లో 8 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలిపారు. ఇంకా కోటి 100 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని, దీంతో రోడ్లు, డ్రైన్లు వేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వంలో సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా పరవళ్ళు తొక్కుతోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.అలాగే సీఎం జగన్, పాత స్కూళ్లను పునరుద్ధరించడమే కాకుండా ఎన్నో సౌకర్యాలను కల్పించారని, విద్య, వైద్యాన్ని సమపాళ్లలో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. 28వ డివిజన్లో రోడ్డు నిర్మాణానికి 40 లక్షల రూపాయలను మంజూరు చేసామని తెలిపారు.

ఇంకా కోటి రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం పేదలకు అందాలనే ఉద్దేశంతో సురక్ష కార్యక్రమం చేపట్టారని గుర్తు చేశారు. ఎవరైనా మంచి విమర్శలు చేయాలని, అవి చౌకబారుగా ఉండకూడదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 31 వ డివిజన్ లోని కార్యక్రమాన్ని నవీన్ కుమార్ రెడ్డి, యెళ్ళ ఆదిరెడ్డి, టీవీఎస్ కమల్, ఐరెడ్డి సుబ్బారెడ్డి నిర్వహించారు. 29వ డివిజన్లో డివిజన్ ఇంచార్జ్ మదన్ మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, కార్పొరేటర్లు విజయభాస్కర్ రెడ్డి, సత్తార్, అవినాష్, గౌరీ, ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నేతలు స్వర్ణ వెంకయ్య, శ్రీకాంత్ రెడ్డి, నరసింహారావు, అల్లా బక్షు, కరీముల్లా, రియాజ్, సూరిబాబు, విజయరామిరెడ్డి, కాలేబు, శరత్ చంద్ర, హరిబాబు యాదవ్, మధు, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, హరిశ్చంద్రా రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంగారెడ్డిలో రాలిపోయిన మరో ఆర్టీసీ కార్మికుడి ప్రాణం

Satyam NEWS

మినిస్టర్స్ వాయిస్: పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యం

Satyam NEWS

150 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment