సమ్మె నిలుపుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అనుదినం కార్మికులను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండటంతో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. మరి కొందరు అస్వస్థతకు గురై మరణిస్తూనే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్ (42) ప్రభుత్వ వైఖరితో మనస్థాపం చెంది అనారోగ్యం పాలై మరణించాడు. కొద్ది రోజులుగా తీవ్ర మనస్థాపంతో ఉన్న నాగేశ్వర్ ను మూడు రోజుల కిందట చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేటి ఉదయం మరణించాడు. నాగేశ్వర్ నారాయణఖేడ్ డిపోలో నగేష్ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. మూడు సంవత్సరాల కిందటే ఇతను రెగ్యులర్ ఎంప్లాయి అయ్యాడు. నవంబర్ 5న కేసీఆర్ డెడ్‌లైన్ ప్రకటించినప్పటి నుంచి తన ఉద్యోగానికి ఏమౌతుందోనని విని అతను అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
previous post