42.2 C
Hyderabad
May 3, 2024 18: 42 PM
Slider కృష్ణ

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి ఇక కష్టకాలం

#balashowri

ఉమ్మడి కృష్ణాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు జనసేన వ్యూహం ఖరారు చేసుకున్నది. ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల గెలుపే లక్ష్యం తో పావులు కదుపుతోంది. ప్రస్తుత వైసీసీ ఎంపి బాలశౌరి ఈనెల 18న గానీ లేదా 22న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరటానికి రంగం సిద్ధం అయింది. ఇది జరిగిన తర్వాత మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థిగా  ఎంపీ వల్లభనేని బాలశౌరిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక అవనిగడ్డ అసెంబ్లీ నుంచి ఎంపీ బాలశౌరి కుటుంబంలో ఒక వ్యక్తిని లేదా అయన అనుచర నాయకునికి అసెంబ్లీ టికెట్ కూడా ఖరారు చేస్తారని సమాచారం. ఇప్పటికే అవనిగడ్డ, మచిలీపట్నం,పెడన  నియోజకవర్గాల రాజకీయ పార్టీల నాయకులు , ఆయన అభిమానులు బాలశౌరిని కలుస్తున్నారు. పెడన నుంచి మంత్రి జోగి రమేష్ ను తప్పించటంతో వైసీపీలో కీలక నేతలే కాదు.. బందరులోనూ వైసీపీ బలగాలు బాలశౌరి గూటికి చేరుతున్నట్టు సమాచారం. ఇక దివిసీమ లోనూ రాజకీయ సమీకరణాలు ఒకసారిగా మారనున్నాయని భోగట్టా. తాజా పరిస్థితి ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బోణీ కూడా అయ్యే అవకాశం కనిపించడం లేదు.

Related posts

తైవాన్ చైనా: మరో యుద్ధం దిశగా ముందడుగు

Satyam NEWS

తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపి చీఫ్ సెక్రటరీ?

Satyam NEWS

16 నుంచి 22 వరకు చిరంజీవి, పవన్ ల జన్మదిన వారోత్సవాలు

Satyam NEWS

Leave a Comment