28.7 C
Hyderabad
April 28, 2024 10: 33 AM
Slider ప్రత్యేకం

16 నుంచి 22 వరకు చిరంజీవి, పవన్ ల జన్మదిన వారోత్సవాలు

pavankalyan

అఖిలభారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత పిలుపుతో విజయనగరంలో మెగాస్టార్ జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు..పార్టీ నేతలు.. అభిమానులు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాటమే ధ్యేయమన్నారు..మెగా అభిమానులు. మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16నుండి ఆగష్టు 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ నేత త్యాడ రామకృష్ణారావు(బాలు) తెలిపారు.

ఈ మేరకు స్థానిక బాలాజీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ సామాజిక భవనంలో మెగాభిమానులతో సమావేశాన్ని నిర్వహించిననంతరం, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు రవణం స్వామి నాయుడు పిలుపు మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, మెగాఫ్యామిలీ ఎల్లప్పుడూ సమాజం, అభిమానుల శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుకుంటుందని, అందుకోసం మా ఆరాధ్యదైవం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే మా అభిమానుల ధ్యేయమని, అందుకు ఈ వారోత్సవాల కార్యక్రమాలు,ప్రజలతో మమేకమైన కార్యక్రమాలగా రూపొందించామని అన్నారు.

ముందుగా ఆగష్టు 16న  మొక్కలు నాటే కార్యక్రమం, 17న చిరంజీవి సినిమా పాటలతో మెగా డాన్స్ పోటీలు,18న పంచముఖ ఆంజనేయ స్వామి కోవెలలో ప్రత్యేక పూజలు, 19న స్కూల్ పిల్లలకు క్యాన్సర్ పరీక్ష శిబిరం మరియు మెగా వైద్య శిబిరం,20న అన్నదాన కార్యక్రమం,21న ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో మెగా  రక్తదాన శిబిరం, మరియు ఆగష్టు 22న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు చిరంజీవి గారి జన్మదిన వేడుకలతో ముగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో మెగాఫ్యామిలీ అభిమానులు, వీరమహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు హాజరయ్యి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అంజనీపుత్ర మరియు జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, పిడుగు సతీష్, చెల్లూరు ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, బూర్లి వాసు,అల్ల బోయిన శివగణేష్ కృష్ణ  సీర కుమార్,గుాడా రాజేష్, దువ్వి రాము, గండుబారికి పైడిరాజు, చందక రాజా, ఎస్.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ ఉద్యమకారులను  సమరయోధులుగా గుర్తించాలి

Satyam NEWS

ఏడేళ్ల తర్వాత దేశంలో జాతీయ క్రీడలు

Satyam NEWS

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

Satyam NEWS

Leave a Comment