33.7 C
Hyderabad
April 29, 2024 23: 11 PM
Slider నల్గొండ

రైతుల జోలికి వ‌స్తే ఖబడ్దార్: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

#komatireddy

పేద‌వాళ్ల భూముల జోలికి ఎవ‌రు వ‌చ్చిన ఊరుకునేది లేద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హెచ్చ‌రించారు. అమాయ‌కులైన పేద రైతుల‌పై దౌర్జ‌న్యానికి దిగితే ఎంత‌కైనా తెగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. నేడు న‌ల్గొండ జిల్లా కనగల్ మండలం జి.యెడవెల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ప్ర‌భుత్వ సాయంతో రైతుల‌పై బెదరింపుల‌కు పాల్ప‌డుతున్న భూముల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పేద‌వాళ్ల భూముల జోలికి ఎవ‌రు వ‌చ్చిన ఊరుకునేది లేద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హెచ్చ‌రించారు. అమాయ‌కులైన పేద రైతుల‌పై దౌర్జ‌న్యానికి దిగితే ఎంత‌కైనా తెగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

గ్రామంలోని స‌ర్వే నెంబ‌ర్ 351 నుంచి 357 వ‌ర‌కు గ‌ల భూముల‌ను 30సంవ‌త్స‌రాల క్రితం ఎఎమ్ఆర్ కాలువ మ‌ట్టి ప‌నుల‌కు ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్నద‌ని వివ‌రించారు. ఆ త‌రువాత స‌దరు రైతులే తిరిగి భూములు సాగు చేసుకుంటున్నార‌ని తెలిపారు. వారి పేరు మీద‌నే పాస్ బుక్ ఇచ్చిన స‌ర్కార్‌, రైతు బంధు సైతం జ‌మ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

కానీ స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులు, పోలీసుల సాయంతో ఆ రైతుల‌ను బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆ భూములు స‌ర్కార్ కు చెందిన‌వి దౌర్జ‌న్యానికి పాల్ప‌డుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎమ్మెల్యే అనుచరుల‌కు 10 ఎక‌రాల భూములు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని చెబుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

రైతులను బెదిరింపు చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. రైతుల‌కు అండగా ఎంత దూర‌మైనా వెళ్లేందుకు సిద్ద‌మ‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై క‌లెక్ట‌ర్‌లో చ‌ర్చించిన‌ట్లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే చీఫ్ సెక్రెట‌రీతో మాట్లాడుతాన‌న్నారు.

ఇక్క‌డి రైతుల బాధ చూస్తుంటే గుండెలు త‌రుక్కుపోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులు వేసిన పంట‌ల‌ను దౌర్జ‌న్యం చేసి నాశ‌నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. స‌ర్కార్‌కు మాన‌వ‌త్వం లేన‌ది అందుకే అన్నం పెట్టే రైత‌న్న‌ల‌ను న‌ర‌క‌యాత‌న‌కు గురిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఇర‌వై ఏళ్లు త‌ను ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌భుత్వ భూముల‌ను పేద‌ల‌కు అందించమే త‌ప్ప  ఇప్ప‌టి ఎమ్మెల్యే మాదిరి ఎవ‌రి నుంచి లాక్కున్న‌ది లేద‌న్నారు.

హుజురాబాద్‌లో దళితుల‌కు రూ. 10ల‌క్ష‌ల సాయం అంటున్న కేసీఆర్ క‌ళ్ల‌కు న‌ల్గొండ జిల్లాలో ద‌ళిత‌, బీసీల భూములపై ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడితే చ‌ర్య‌లు తీసుకోరా అని ప్ర‌శ్నించారు. ఇక్క‌డ ఎవ‌రికైనా ఎమైనా జ‌రిగితే ఊరుకునేది లేదని స్ప‌ష్టంచేశారు. భూముల గురించి రైతుల ప‌క్షాన అవ‌స‌ర‌మైతే కోర్టు మెట్లు ఎక్కేందుకు సైతం సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు.

పెద్ది నరేందర్, సత్యం న్యూస్, నకిరేకల్

Related posts

హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ తప్పదు?

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ఇద్దరికి కరోనా పాజిటివ్

Satyam NEWS

ఎరువుల ధరల పెంపుపై సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన

Satyam NEWS

Leave a Comment