40.2 C
Hyderabad
May 2, 2024 15: 12 PM
Slider ముఖ్యంశాలు

కొల్లాపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ 28వ ఆవిర్భావ వేడుకలు

#mrps

1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఏర్పడిన ఎమ్మార్పీస్ ఉద్యమం నేటికీ 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కొల్లాపూర్ తాలూకా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఏర్పడిన ఎమ్మార్పీఎస్ మాదిగల హక్కుల కోసమే కాకుండా సమాజంలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిందని గుర్తు చేశారు

సమాజంలో గుండెదబ్బ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే విధంగా వృద్ధులు వితంతువుల పెన్షన్ పెంచడం కోసం ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ లో రిజర్వేషన్లు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయబడిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తిరిగి సాధించడం లాంటి ఎన్నో ప్రజా ప్రయోగ పనులను ఎమ్మార్పీఎస్ ఈ సమాజానికి అందించిందని పేర్కొన్నారు.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను 100 రోజుల్లో చేస్తామని 8 సంవత్సరాలు గడిచిన వర్గీకరణ విషయంలో బిజెపి ప్రభుత్వం ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోకపోవడం అదేవిధంగా హైదరాబాదులో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం బిజెపి దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని భావిస్తున్నామని వారు తెలిపారు.

షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చేయకుండా బిజెపిని తెలంగాణలో రాజకీయ భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వై యాదగిరి మాదిగ, జంగం శివానందo, శీల వెంకటేష్, శ్రీనివాస్ యాదవ్,పుటపోగు రాముడు, రత్న, రామకృష్ణ,  నాగరాజు, కురుమయ్య, లక్ష్మణ్, కారంగి నరసింహ, ఈశ్వర్, డి నరసింహ, నరసింహ, రమేష్, శివ,ప్రవీణ్,నాగరాజు,మహేష్,సింహాద్రి,సుదర్శన్, MRPS MSP MSF నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపిలో వైఎస్ఆర్ నవోదయం పథకం ప్రారంభం

Satyam NEWS

A professional cover letter is an essential doc which have been capable to have very just as much have an affect on your job research achievement for your resume

Bhavani

అత్యంత మారుమూల ప్రాంతానికి పోలీసుల చొరవతో రోడ్డు

Satyam NEWS

Leave a Comment