37.7 C
Hyderabad
May 4, 2024 11: 56 AM
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం చేస్తామన్న కామారెడ్డి మునిసిపల్ చైర్మన్

#vittujahnavi

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. రేపు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి రైతులు సన్నద్ధం అవుతుండగా నేడు మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి ఆరోగ్యం సహకరించకున్నా మీడియా ముందుకు వచ్చి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. రేపే కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తిర్మణాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు.

మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ నిట్టు జాహ్నవి మాట్లాడుతూ.. రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు తెస్తోందన్నారు. అలాంటిది రైతులకు అన్యాయం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించాయని, అందుకే నెలన్నర రోజులుగా మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు.

27 మార్చి 20201 లో మాస్టర్ ప్లాన్ పై కౌన్సిల్ చేసిన తీర్మానం ప్రకారం ముసాయిదా డ్రాఫ్ట్ తయారు కాలేదన్నారు. డీడీఎఫ్ కన్సల్టెన్సీ, డిటిసిపి అధికారులు తాము పంపిన ప్రతిపాదనలకు విరుద్ధంగా ముసాయిదా తయారైందన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కూడా మీడియా సమక్షంలో వెల్లడించారని తెలిపారు. తాము రెసిడెన్షియల్, రిక్రియేషన్ జోన్లలో చూపిన భూములను ఇండస్ట్రియల్ జోన్లలోకి మార్చారన్నారు.

ఫలితంగా రైతులు తమ భూములు కోల్పోతున్నామేమోనని ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన ఒక్క గుంట భూమి కూడా మాస్టర్ ప్లాన్ లో పోదని స్పష్టం చేశారు. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులకు ఎలాంటి నష్టం చేయాలనుకోలేదని, అలా చేయాలనుకుంటే మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలపాల్సిందిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ఆమోదించేవాళ్ళమని తెలిపారు.

నెలన్నర రోజులుగా రైతులు ఆందోళన చేయడం బాధాకరమన్నారు. ప్రజల నుంచి ఇప్పటి వరకు 2396 అభ్యంతరాలు వచ్చాయన్నారు. రేపు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని, కౌన్సిల్ ప్రతిపాదించిన దానికి విరుద్ధంగా తయారైన ముసాయిదాను రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేస్తామన్నారు.

రైతులకు చెందిన గుంట భూమి కూడా ఎక్కడికి పోదని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. మాస్టర్ ప్లాన్ విషయంలో అనారోగ్య కారణాల వల్ల స్పందించడం ఆలస్యం అయినందుకు క్షమించాలన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దుకోసం తీర్మానం చేయడంతో పాటు మార్పులు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఇంటి ముట్టడి వాయిదా

మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి ప్రకటనతో రేపు చేపట్టిన ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. రేపు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు తీర్మానం ప్రవేశపెట్టాలని కోరింది. అలాగే రేపు అడ్లూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, రైతులందరు సకాలంలో అడ్లూర్ గ్రామానికి చేరుకోవాలని కోరింది.

Related posts

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు

Satyam NEWS

NPDCL సిఎండికి అనురాగ్ సొసైటీ అభినందన

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల రూపాయల విరాళం

Satyam NEWS

Leave a Comment