మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మార్చవద్దని డిమాండ్ చేస్తూ నేడు ఆయన ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాజధాని ని మార్చడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని ఆయన అన్నారు.
ఈ డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నం కోనేరు సెంటర్ లో రహదారికి అడ్డంగా నిరసన కార్యక్రమం చేపట్టిన నందుకు అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.