34.2 C
Hyderabad
May 14, 2024 22: 57 PM
Slider గుంటూరు

పారిశుధ్య కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు

#MLAMangalagiri

ఎండనకా,వాననకా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి శ్రమించే పారిశుధ్య కార్మికులను ఇబ్బంది పెట్టడం సరి కాదని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సూచించారు.

తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలంటూ ఏ ఐ టి యు సి ఆధ్వర్యాన పారిశుధ్య కార్మికులు విధుల్ని బహిష్కరించి  శుక్రవారం ఉదయం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అదే సమయంలో కళా వేదిక పనులు పరిశీలించేందుకు అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కార్మికులను విధుల్లో నుండి తొలగించేందుకు శానిటరీ ఇన్స్పెక్టర్ నజీర్  ను  కారణాలడిగారు.తమకు సమాచారం ఇవ్వకుండా గుంటూరు లో జరిగే ధర్నాకు వెళ్లారని అందువల్లనే విధుల్లో నుండి తప్పించాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చారు.

ఎమ్మెల్యే స్పందిస్తూ,అయినంత మాత్రాన విధుల్లో నుండి కార్మికులను తప్పిస్తారా!అంటూ ప్రశ్నించారు.కార్మికులను ఇబ్బంది పెట్టవద్దని,మీ వైఖరి మార్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు శానిటర్ ఇన్స్పెక్టర్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్,ఎంమున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి గండికోట దుర్గారావు,నాయకులు కృష్ణ,హరిభాబు తదితరులు పాల్గొన్నారు.

కార్మికులతో అల్పాహారం సేవించిన ఆర్కే

పారిశుధ్య కార్మికుల కు ఎమ్మెల్యే ఆర్కే  అల్పాహారం  తెప్పించారు.తానూ వారితో కూర్చొని అల్పాహారం సేవించారు.ఇందుకు అయిన ఖర్చు రూ.5 వేలు ఎమ్మెల్యే చెల్లించారు. ఎమ్మెల్యే ఆర్కే చొరవతో సమస్య పరిష్కారం కావటం తో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే వెంట వై సి పి మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల మాల్లేశ్వరరావు,నాయకులు పచ్చల శ్యామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జూపల్లి రోడ్‌షో

Bhavani

23న ఏలూరు రానున్న వాటికన్ రాయబారి

Satyam NEWS

పురంద‌ర దాసు కీర్త‌న‌ల‌తో సంగీత పితామ‌హుల‌కు సంస్మ‌ర‌ణార్చ‌న‌

Satyam NEWS

Leave a Comment