38.2 C
Hyderabad
April 29, 2024 22: 03 PM
Slider నల్గొండ

మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్స్ విడుదల చేయాలి

#citu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయి మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో షేక్ బేగం అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశేట్టి యాదగిరి రావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భోజనం కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని,పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుకార్చుటకు కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగమే నిధులను విడుదల చేయకుండా పెండింగ్లో పెడుతున్నదని అన్నారు.

ధరలు ఆకాశాన్నంటుతున్నా మెనూ చార్జీలు పెంచకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.అప్పులు తెచ్చి వంటచేసి పెడుతున్నారని,మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 19,000 రూపాయలు ఇవ్వాలని, కోడిగుడ్లు, కందిపప్పు,ప్రభుత్వమే సప్లై చేయాలని, వంట ఏజెన్సీ వారికి డ్రస్సులు, వంటపాత్రలు ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు శీతల రోషపతి,ఎస్.కె యాకుబ్,మంగమ్మ,సీతమ్మ,నాగమణి, వెంకటరమణ,ప్రమీల,లక్ష్మి, బచ్చలకూర, మంగమ్మ,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మైనారిటీ అమ్మాయిలపై అత్యాచారం చేసేవారిని ఎన్ కౌంటర్ చేయాలి

Satyam NEWS

ముత్యాలమ్మ అమ్మవారికి జలాలతో జల యజ్ఞo

Bhavani

ఈత సరదా తో వెళితే ముగ్గురి ప్రాణాలు తీసిన పులిగుండాల

Satyam NEWS

Leave a Comment