29.7 C
Hyderabad
April 29, 2024 10: 12 AM
Slider ముఖ్యంశాలు

గ్రామాల అభివృద్ధికి మైహోం ఇండస్ట్రీ చేయూత

#mellacheruvu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని మైహోం సిమెంట్ పరిశ్రమ పరిసర గ్రామాల అభివృద్ధికి సామాజిక బాధ్యతగా అనేక సంక్షేమ కార్యక్రమాలను  చేస్తుందని పరిశ్రమ యూనిట్ హెడ్ శ్రీనివాస రావు తెలిపారు.

మేళ్ళచేరువు గ్రామ అభివృద్ధికి 10 (పది)లక్షల చెక్కును,వేపల మాధవరం గ్రామ అభివృద్ధికి పది లక్షల చెక్కులను అయా గ్రామ సర్పంచ్ శంకర్ రెడ్డి,సునీత బాలరాజు లకు,గ్రామ కార్యదర్శి,వార్డ్ మెంబర్లు,గ్రామ పెద్దల సమక్షంలో అంద చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామ సర్పంచ్ లు మాట్లాడుతూ తమ గ్రామాల అభివృద్ధికి అనేక మంచి కార్యక్రమాల చేపడుతున్న మైహోం యాజమాన్యానికి  అభినందన కృతజ్ఞతలు తెలిపారు.

మైహోం పరిశ్రమ యూనిట్ హెడ్ శ్రీనివాస రావు మాట్లాడుతూ ఇవే కాకుండా  పరిశ్రమ యందు పరిసర గ్రామాల నిరుద్యగ యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ప్రతి సంవత్సరం కొంతమందికి స్కాలర్ షిప్ అందజేస్తూ శిక్షణ ఇవ్వడం కొనసాగుతుందని,ఈ విధంగా రెండు బ్యాచ్ లను పూర్తి చేసి మంచి అవకాశాలను కల్పించామని,మున్ముందు ఇదే విధముగా కొనసాగుతుందని,  అభివృద్ధి కార్యక్రమాలు,పల్లె ప్రకృతి వనము,స్మశాన వాటికలకు ఇతోధిక సాయం,ట్రీ గార్డ్స్ ఏర్పాటు,ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ఇలా అనేక కార్య్రమాలను చేపడుతున్నామని తెలిపారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని” అజాదికి అమృత్ మహోత్సవ్” పేరిట చెట్లు నాటటం,ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సృజనాత్మక పెంచటం కోసం, పర్యావరణం,ఆరోగ్యం,పరిశుభ్రత వివిధ అంశాలపై వ్యాస రచన పోటీలు మైహోం  పరిశ్రమ నిర్వహిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమములో  హెచ్.ఆర్.జి. ఎం.నాగేశ్వర రావు,మైన్స్ హెడ్ శ్రీనివాస రావు ,ఆయా గ్రామ సర్పంచ్ లు శంకర్ రెడ్డి,సునీత బాలరాజు పంచాయతీ కార్యదర్శి నారాయణ రెడ్డి,ఉప సర్పంచ్ మస్తాన్,వార్డ్ మెంబర్ లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఈ చెత్త రోడ్లకు మరమ్మతులు చేపట్టండి మహాప్రభో

Satyam NEWS

టర్కీలో భూకంపం: 53 మంది మృతి

Bhavani

మట్టిలో మాణిక్యం: చంద‌లాపూర్ యువ‌కుడు సుమంత్ శర్మ

Satyam NEWS

Leave a Comment