31.2 C
Hyderabad
May 3, 2024 02: 37 AM
Slider మహబూబ్ నగర్

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తాహాసిల్దార్లు శ్రద్ధ చూపాలి

#nagarkurnool

గ్రామాల్లోని ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన బాధ్యతతో పాటు రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా తహశీల్దార్ల పైనే ఉందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం కల్వకుర్తి, కొల్లాపూర్ రెవిన్యూ డివిజన్ మధ్యాహ్నం నాగర్ కర్నూల్ అచ్చంపేట రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఆర్డివోలు,మండలల తహసిల్దార్ లతో రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలకు, ప్రభుత్వ అభివృద్ధి పనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు ప్రభుత్వ విద్యాసంస్థలకు కేటాయించాల్సిన ప్రభుత్వ స్థలాలు, లోకాయుక్త, హైకోర్టు కోర్ట్ కేసులు,సియం జిబి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుండి వచ్చిన ఫిర్యాదులు, ప్రజావాణి  షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి   18 అంశాలపై అదనపు కలెక్టర్లు మను చౌదరి, రాజేష్ కుమార్ లతో కలిసి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు ధరణి నిర్వహణతో పాటు రెవెన్యూ పరమైన అంశాలపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, జిల్లాలో మంజూరైన ప్రభుత్వ పథకాలు, విద్యా సంస్థల నిర్మాణాలకు కేటాయించాల్సిన ప్రభుత్వ భూములను సాధ్యమైనంత త్వరగా  కేటాయించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూముల ను సర్వే చేయించాలని సూచించారు. రక్షణగా హద్దులను ఉపాధి హామీ పథకం ద్వారా మూడు ఫీట్ల ఎత్తువరకు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని ఆపివేసి నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని కలెక్టర్ చెప్పారు. ప్రజావాణి ఇతర సీఎం జిబి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ధరణి ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న ధరణి  ఫిర్యాదులను తాహసిల్దార్ ల వారీగా సమీక్షించి సమావేశంలోనే కలెక్టర్ పరిష్కరించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆర్ డి ఓలు , హనుమానాయక్, నాగలక్ష్మి పాండు నాయక్, కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ తబిత,  డిటిలు రాజ్ కుమార్, ప్రభాకర్, నజీర్ అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

గెస్ట్ విత్ చెక్: పెళ్లి పందిట్లోనే కళ్యాణలక్ష్మి చెక్కు అందజేత

Satyam NEWS

బిక్షాటనతో వినూత్న నిరసన వ్యక్తం చేసిన పంథాగాని

Satyam NEWS

(Sale) Differencebetween Hemp Seed Oil And Cbd

Bhavani

Leave a Comment