Slider నల్గొండ

అనవసరంగా బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవు

SP Ranganath

కరోనా బారి నుండి ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని, అనవసరంగా బయటికి వస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ హెచ్చరించారు. బుధవారం ఆయన నల్లగొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ ప్రాంతాలలో రెడ్ జోన్లతో పాటు దామరచర్లలోని రిలీఫ్ క్యాంపును పరిశీలించారు.

రిలీఫ్ క్యాంపులో ఏర్పాటు చేస్తున్న భోజనాన్ని ఆయన పరిశీలించి వారితో మాట్లాడారు. కరోనా వైరస్ పెరిగిపోతున్న మే 7వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, అందువల్ల ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లాలని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్టంగా చర్యలు తీసుకుంటూ జిల్లాలో కోవిడ్ – 19 కేసులు పెరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక పోలీస్ అధికారులు నిగిడాల సురేష్, రమేష్ బాబు తదితరులున్నారు.

Related posts

సినిమా పిచ్చితో ఇల్లు అమ్మి మరీ ఈ చిత్రం తీస్తున్నా

Satyam NEWS

ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలి

Satyam NEWS

బంజారాహిల్స్ పోలీసులపై మత్తులో ఉన్న యువ‌తి దాడి

Satyam NEWS

Leave a Comment