37.2 C
Hyderabad
May 2, 2024 11: 22 AM
Slider ఆదిలాబాద్

విధుల్లో ఉన్న పోలీసులకు విటమిన్ డ్రింక్స్ సరఫరా

nirmal police 221

నిర్మల్ జిల్లా లోని కంటైన్ మెంట్ జోన్ లలో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి స్థానిక సంస్థల వారు విటమిన్ డ్రింక్స్ ను సరఫరా చేశారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్మల్ గ్రామీణ సిఐ శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహంతో సారంగాపూర్ ఎస్ఐ, తిరుమల హాస్పిటల్ డాక్టర్, సింగ్ ఈజ్ కింగ్ ధాభా, బాలాజీ బుక్ స్టోర్ వారి సౌజన్యంతో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు.

జిన్కోడ్, (బి)&(సి) విటమిన్ మెడిసన్స్, వాటర్ మిలాన్, భోజనం, మజ్జిగ ప్యాకెట్ అందచేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పేదలకు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, పోలీసులు ఓ వైపు డ్యూటీ చేస్తూ మరోవైపు సేవ చేస్తున్నారు.

ఓ వైపు పేదల ఆకలి తీరుస్తూ మరోవైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతుండడంతో ప్రజలు జయహో పోలీస్ అని కితాబునిస్తున్నారు. ఎండవేడిమి కారణంగా రోడ్లపై విధులు నిర్వహించే సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొని శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవాలని సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని పగలు, రాత్రి కష్టపడి ప్రజల్లో అవగాహన కల్పించి కరోనాను ఎక్కడికక్కడ ఆపగలగమని తెలిపారు.

అలాగే ప్రజలకు కరోనా నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశాలను వివరించడంతో పాటు మాస్కులను ధరించుట, శుభ్రత, సామాజిక దూరం పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇంటి వద్దనే ఉండి ప్రభుత్వ సూచనలు పాటించి వైరస్ వ్యాప్తి చెందకుండా సహకారం అందించాలన్నారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ వారికి తోచిన రీతిలో సహాయం చేస్తున్నారని అలాగే లాక్ డౌన్ ముగిసేవరకు విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు వలస కూలీలు, నిరుపేదలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.

ప్రజలంతా తమ తమ ఇంట్లోనే ఉండి నాలుగు నుంచి ఐదు అడుగుల సామాజిక దూరం పాటించి వైరస్ నియంత్రణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, నిర్మల్ పట్టణ/గ్రామీణ/సొన్ సిఐలు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, డాక్టర్ లు రమేష్ రెడ్డి, వేణుగోపాల్, ఆర్ఐలు వెంకటి, కృష్ణ ఆంజనేయులు, ఎస్ఐలు, చిలమంతుల శివప్రసాద్, గురుమిత్ సింగ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరణం నియోగ బ్రాహ్మణ ఐక్యత చాటండి

Satyam NEWS

వాటా కోసం డిమాండ్: ఎన్ డి ఏలో మొదలైన లుకలుకలు

Satyam NEWS

హుజురాబాద్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్ చార్జిలు వీరే

Satyam NEWS

Leave a Comment