Slider నల్గొండ

రేషన్ కార్డు లేని వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

congress

లాక్ డౌన్ నేపథ్యంలో కూలీలు, కార్మికులు, రేషన్ కార్డులు లేని వారిని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కోరారు. బుధవారం స్పెషల్ కలెక్టర్  రాహుల్ శర్మ ను కలిసి వలస కార్మికులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ తో ప్రభుత్వాలు లాక్ క్ డౌన్ విధించడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు, వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రభుత్వం తగిన వసతి కల్పించి నిత్యావసర సరుకులను అందజేయాలని కోరారు.

దీపం పథకం కింద మహిళా సంఘాలకు ఉచితంగా సిలిండర్ లను కూడా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ సమీపిస్తున్నందున రైతులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం కావలసిన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరారు.

లాక్ డౌన్ లో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ బ్యాంకులలో 1500 రూపాయలు జమ చేస్తానని పేర్కొనగా, ఇంకా చాలామంది ఖాతాలో డబ్బులు జమ కాలేదని పేర్కొన్నారు. రేషన్ కార్డు దారులు అందరికీ బ్యాంకులో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లా ప్రజలంతా లాక్ క్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంటికే పరిమితమవుతున్నారనీ తెలిపారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను, కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. రేషన్ కార్డులు లేని పేదలకు కూడా ఉచితంగా బియ్యం, నగదును అందజేయాలని పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాడుగుల పల్లి జడ్పిటిసి సైదులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్, చెరుపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలను అణగదొక్కిన జగన్

Satyam NEWS

ఓ గాడ్:ఒంగోలు శివార్లలో మహిళపై అత్యాచారం?

Satyam NEWS

హుజూర్ నగర్ పోలీస్ సిబ్బందికి ఫేస్ షీల్డ్, శానిటైజర్ స్టాండ్

Satyam NEWS

Leave a Comment