36.2 C
Hyderabad
May 14, 2024 18: 20 PM
Slider హైదరాబాద్

విద్వేషం రగిల్చే ప్రసంగం కేసులో అక్బరుద్దీన్ కు నాంపల్లి కోర్టు ఊరట

akbaruddin-owaisi

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ విద్వేషం రగిల్చే ప్రసంగం కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్‌, నిర్మల్‌లో  మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేశారంటూ  అక్బరుద్దీన్‌ ఒవైసీపై నమోదైంది.

ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్‌ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. విచారణ అనంతరం కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా నాంపల్లి కోర్టు ప్రకటించింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే కేసు కొట్టివేసినంత మాత్రాన సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది.

Related posts

టవర్ క్లాక్ బ్రిడ్జి అవకతవకలపై విచారణ జరపాలి

Bhavani

నిషేధిత అలివి వలలపై మత్స్యకారులకు అవగాహన సదస్సు

Satyam NEWS

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment