33.7 C
Hyderabad
April 30, 2024 02: 10 AM
Slider నల్గొండ

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ లే అవుట్ ప్లాట్ల అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్దమని,ఎమ్మెల్యే సైదిరెడ్డి మీరు సిద్ధమా? అని పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి సవాల్ విసిరారు. హుజూర్ నగర్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ రావు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ లే అవుట్ ఆక్రమణలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు,కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ లే అవుట్ ప్లాట్ల మాయంపై వివరణ ఇవ్వాల్సిన మున్సిపల్ కమీషనర్,చైర్ పర్సన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని,ఇది దేనికి సంకేతం?అని వారు ప్రశ్నించారు. గుమ్మడి కాయలు దొంగ ఎవరంటేఎమ్మెల్యే సైదిరెడ్డి భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మున్సిపాల్టీ లే అవుట్ అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపు నిచ్చిందని,ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులే చైర్మన్ గా ఉన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి కి గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవినీతి జరిగి ఉంటే ఇప్పుడు ఉన్నది టిఆర్ఎస్ పార్టీయే నని,ప్రభుత్వ అధికారులచే విచారణ చేపట్టాలని,అందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధమే అని సవాల్ విసిరారు.తెరాస మున్సిపాలిటీ  అధికారం చేపట్టిన తర్వాత చైర్ పర్సన్ భర్త గెల్లి రవి టౌన్ ప్లానింగ్ అధికారిని బెదిరించి  మున్సిపాలిటీకి చెందిన లే అవుట్ ప్లాట్ల విలువైన డాక్యుమెంట్లు దొంగిలించిన దానిపై టౌన్ ప్లానింగ్ అధికారి పట్టణ ప్రజలకు ఆడియో వినిపించి తన మోర వినిపిచింది వాస్తవం కాదా?ఎందుకు చైర్ పర్సన్ పై చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే సైదిరెడ్డి ని ప్రశ్నించారు.లే అవుట్ భూములకు సంబంధించిన డాక్యు మెంట్లు మాయం చేసిన దాంట్లో ఎవరు సూత్రదారులు?ఈ అవినీతిలో ఎవరు పాత్ర దారులో? బహిరంగ విచారణకు టిఆర్ఎస్ నాయకులు సిద్ధమా అని అన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, రైల్వే బోర్డు సభ్యుడు యరగాని నాగన్న గౌడ్,పిసిసి డెలిగేట్ దోంగరి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్స్ కోతి సంపత్ రెడ్డి,రాజా నాయక్, సరిత వీరారెడ్డి,విజయ వెంకటేశ్వర్లు, దనమ్మ జైలు,కాంగ్రెస్ నాయకులు జక్కుల మల్లయ్య,బచిమంచి గిరిబాబు,బంటు సైదులు,యడవెల్లి వీరబాబు,ముశం సత్యనారాయణ,మిన్నయ్య,రామమూర్తి, కుక్కడపు మహేష్ గౌడ్,తేజవత్ సైదులు నాయక్,సైదులు,రాము తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

బాలికల అనాధ బాల సదనంకు కలెక్టర్ శర్మన్ విరాళం

Satyam NEWS

జిల్లా సర్వజన హాస్పటల్ లో హఠాత్ పరిణామం…!

Satyam NEWS

సెల్ఫ్ క్యారంటైన్: జనతా కర్ఫ్యూ లో ఉన్న మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment