33.2 C
Hyderabad
May 15, 2024 13: 42 PM
Slider సినిమా

ప్రొద్దుటూరు లో లెజెండ్ మూవీ 7 వ వార్షికోత్సవం

#NandamuriBalakrishna

డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహా నందమూరి బాలకృష్ణ రెండవసారి నటించిన సంచలన సూపర్ హిట్ చిత్రం లెజెండ్.

ఈ చిత్రం 2014 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 1116 రోజులు ప్రదర్శించి రికార్డు సృష్టించింది.

ఆరవేటి థియేటర్ 56రోజులు (4ఆటలు), షిఫ్ట్ పై అర్చన థియేటర్ 400 రోజులు (4ఆటలు) 1116 రోజులు (ఉదయం ఆటలు) విజయవంతంగా ప్రదర్శింపబడింది.

ఆల్ టైమ్ సౌత్ ఇండియా రికార్డ్ సృష్టించి ఆదివారం నాటికి 7 వసంతాలు పూర్తి చేసుకున్నది.

ఈ శుభసందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని అర్చన థియేటర్లో నందమూరి అభిమానుల సమక్షంలో 7 కేజీల భారీకేక్ కట్ చేశారు.

థియేటర్ నిర్వాహకుడు కోనేటి ఓబులరెడ్డి కి శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. నందమూరి వీరాభిమాని కె.హేమాంబరధరరెడ్డి (బద్రి) ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు.

Related posts

రేపటి నుండి ములుగు జిల్లాలో లో రెండో దశ కరోనా టీకా

Satyam NEWS

స‌ర్ధార్‌కు నివాళులు!

Sub Editor

చంద్రశేఖర్ ఆజాద్ 89వ వర్ధంతి సందర్భంగా నివాళులు

Satyam NEWS

Leave a Comment