29.7 C
Hyderabad
April 29, 2024 10: 01 AM
Slider విజయనగరం

సిలెండ‌ర్ల లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి…!

#Accident

ఈ ఉద‌యం ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా  ఐద‌వ బెటాలియ‌న్ స‌మీపంలో సుంక‌రి పేట వ‌ద్ద‌…రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ కొన్న  ఘ‌ట‌న‌లో ముగ్గ‌రు మృతి చెంద‌గా..39 మంది గాయ‌ప‌డ్డారు. విజ‌య‌న‌గ‌రం నుంచీ విశాఖ వెళుతున్న ఆర్టీసీ బ‌స్సు…సిలెండ‌ర్ల తో వెళుతున్న లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి..ఎదురుగా విశాఖ నుంచీ పాల కొండ వెళుతున్న ఆర్టీసీ బ‌స్సును అంతే వేగంతో  ఢీకొట్టింది.

దీంతో పెద్ద‌గా శ‌భ్దం రావ‌డంతో..అక్కడి ద‌గ్గ‌ర‌లోనే ఐదవ బెటాలియ‌న్ లో వాకింగ్ చేస్తున్న‌ క‌మాండెంట్ కోటేశ్వ‌ర‌రావు…త‌న సిబ్బందితో హుటాహుటిన సుంక‌రి పేట‌కు వ‌చ్చి…జ‌రిగిన ప్ర‌మాదాన్ని గుర్తించారు. స‌రిగ్గా 7.50 కి ప్ర‌మాదం జ‌రిగింది.

ఆ వెంటనే ఘ‌ట‌నా స్థ‌లికి జిల్లా ఎస్పీ రాజకుమారీ..డీఎస్పీ అనిల్, రూర‌ల్ సీఐ మంగ‌వేణి  చేర‌కున్నారు.అప్ప‌టికే భారీ స్థాయిలో  ట్రాఫిక్ జామ్ అయ్యింది. అస్స‌లు ప్ర‌మాదం  ఎలా జ‌రిగింది….అన్న‌ది తెలుసుకునే లోపే హైవే పై భారీస్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. చుట్టు ప‌క్క‌ల స్థానికులు…ఏం జ‌రిగింది..?ఎంత‌మంది చనిపోయారు..? అస‌లు ప్ర‌మాదానికి కార‌ణాలు ఏంటి అన్న ఆస‌క్తితో రోడ్ల మీద‌కు వ‌చ్చారు.

రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ కొన‌డంతో…విశాఖ నుంచీ పాల‌కొండ వెళుతున్న ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ ఆశీర్వాదం..ఎదురుగా మ‌రో ఆర్టీసీ బ‌స్సు  ఊహించ‌న విధంగా ఢీ కొట్ట‌డంతో…..అక్క‌డిక్కే  ఇరుక్కుపోయి..మృతి చెందాడు.

అలాగే విశాఖ వెళుతున్న ఆర్టీసీ డ్రైవ‌ర్ దేవుడు కూడా స్పాట్ లో దుర్మ‌ర‌ణం చెందాడు. హుటాహుటిన ఎస్పీ ఆదేశాల మేర‌కు డీఎస్పీ అనిల్, ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు,రూర‌ల్ సీఐ మంగ‌వేణి,ఎస్ఐ  నారాయ‌ణ రావులు ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేసే ప‌నిలో ప‌డ్డారు.ఆ స‌మ‌యంలోనే ఆర్ఎస్ఎస్ ప్రాంత స‌హ ప్ర‌చారక్ ఆదిత్య‌…విజ‌య‌న‌గ‌రం నుంచీ విశాఖ కు మ‌రో ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణీస్తున్నారు.

హైవేపై ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో  దాదాపురెండు గంట‌ల పాటు ట్రాఫిక్ స్తంభించింది.ఆ స‌మ‌యంలో ఇరుక్కుపోయిన రెండు బ‌స్సుల‌ను…విడ‌గొట్టేందుకు.. పోలీసులు నానా తంటాలు ప‌డ్డారు. ప్రైవేటు క్రేన్ తెప్పించి..తొలుతు రెండు బ‌స్సుల‌ను విడగొట్టారు. అంత‌కుమందే క్ష‌త గాత్రుల‌ను..108 వాహ‌నంలో విజ‌య‌న‌గ‌రం మ‌హారాజా ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.

ప్ర‌మాదానికి కార‌ణం  ద‌ట్ట‌మైన పొగ‌…లేక‌..అతి వేగ‌మా..?

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లిని ఎస్పీ రాజ‌కుమారీ…ఆర్టీసీ ఆర్ఎం  అప్ప‌ల‌రాజు ప‌రిశీలించారు. రోడ్డు కు ప‌క్క‌నే మంట పెట్ట‌డంతో..ఆ పొగ కార‌ణంగా ఆర్టీసీ డ్రైవ‌ర్ కాస్త ఇబ్బంది ప‌డిన‌ట్టు గా  సుంక‌రిపేట వాస్తవ్యులు చెబుతున్నారు. అలాగే…సిలెండ‌ర్ల లారీని త‌ప్పించ‌బోయి.అదే వేగంతో ఎదురుగా వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సును ఢీ కొన్న‌ట్టు స్థానికులు చెబుతున్నారు.

బెటాలియ‌న్  క‌మాండెంట్, సిబ్బందే ప్రాణం పోసారు..!

హైవేపై సుంక‌రి పేట వ‌ద్ద  ఆర్టీసీ రిక్వ‌స్ట్ స్టాప్ ఉంది…అక్క‌డే స‌రిగ్గా రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీకొన‌డం..ఆ శ‌బ్దం విన్న 5 వ బెటాలియ‌న్ క‌మాండెంట్ కోటేశ్వ‌ర‌రావు, హుటా హుటిన త‌న సిబ్బందితో ప్రత్యేక వాహ‌నాల‌లో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని…అందుకు కార‌ణాల‌ను ప‌రిశీలించారు. త‌క్ష‌ణం  ట్రాపిక్ ను నిలుపు ద‌ల చేసారు.హుటాహుటిన త‌న గ‌న్ మేన్ ద్వారా.. కంట్రోల్ రూమ్ కు,అలాగే  ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఆ స‌మ‌యంలో ఓ వైపు ట్రాఫిక్ ను మ‌రో వైపు రోడ్డు పైకి వ‌స్తున్న జ‌న  సందోహాన్ని నియంత్రించే ప‌నిలో ప‌డ్డారు.  ఘ‌టనా స్థ‌లికి ఎస్పీ రాజుకుమారీ వ‌చ్చిన మరుక్ష‌ణం… ప్ర‌మాదం జ‌రిగిన తీరు తెన్నుల‌ను ద‌గ్గ‌రుండీ ప‌రిశీలించారు. రోడ్డు ప‌క్క‌నే మంట పెట్ట‌డం…దాని వ‌ల్ల పొగ రావ‌డం…అలాగే గ్యాస్  సిలెండ‌ర్ల‌తో లారీ బ‌య‌లు దేర‌డం…ఇక వేగంగా రెండు ఆర్టీసీ బ‌స్సులు రావ‌డంతో…ఇత్యాది కార‌ణాల‌ను ఎస్పీ నిశితంగా ప‌రిశీలించారు.

హాస్ప‌ట‌ల్ వ‌ద్ద‌కు ఎస్.కోట ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా స‌మ‌న్వ‌య క‌ర్త శ్రీనివాస్

హైవే పై ప్ర‌మాదం జ‌రిగింద‌న్న విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస‌రావు, వైఎస్ఆర్సీపీ జిల్లా స‌మ‌న్వ‌య క‌ర్త  శ్రీనివాస‌రావు(చిన్న శీను) హుటాహుటిన విజ‌య‌న‌గ‌రం మ‌హారాజ ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్ కు వ‌చ్చారు. హాస్ప‌ట‌ల్ లోని అత్య‌వ‌స‌రం వార్డులో చిక్సిత పొందుతున్న క్ష‌త గాత్రుల‌ను ప‌రిశీలించారు.అలాగే హాస్ప‌టల్ లోని  ఎమ‌ర్జెన్సీ వార్డు వ‌ద్ద జేసీ కిషోర్ కుమార్, ఎస్పీ రాజ‌కుమారీ,ఆర్డీఓ భ‌వానీ శంక‌ర్ లు..డాక్టర్ల గౌరీశంక‌ర్ తో మాట్లాడి…అత్య‌వ‌స‌రంగా వైద్య స‌హాయం అందించాల‌ని సిబ్బందిని ఆదేశించారు.

Related posts

50 కుటుంబాలు…డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిక

Satyam NEWS

రానా ద‌గ్గుబాటి లాంచ్ చేసిన ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ టైటిల్ పోస్ట‌ర్‌

Satyam NEWS

తుమ్మలపల్లి రామసత్యనారాయణకు “సినీ విరాట్” బిరుదు ప్రదానం

Satyam NEWS

Leave a Comment