26.7 C
Hyderabad
May 3, 2024 08: 55 AM
Slider వరంగల్

రేపటి నుండి ములుగు జిల్లాలో లో రెండో దశ కరోనా టీకా

#MuluguCollector

సోమవారం నుండి రెండో విడత కరోనా వాక్సినేషన్ ప్రారంభం కానున్న సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తో  ఆదివారం  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 45 నుండి 59, 60సంవత్సరాల పై బడిన వారికి వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు సంబంధిత గ్రామాలలోకాని, మండలాల్లోని ఎంబీబీఎస్ డాక్టర్ చేత  తమకు సంబంధించిన  దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు, ఇచ్చిన సర్టిఫికెట్, ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు గానీ, ఓటర్ ఐడి గాని, పాన్ కార్డ్ తో ,Cowin.gov.in లో, ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అన్నారు. 

ఆన్లైన్లో చేసుకోని పక్షంలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న సర్టిఫికెట్, ఏదైనా గుర్తింపు కార్డుతో స్వయంగా ఏరియా హాస్పిటల్ కు వచ్చి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ఉదయం 10 గంటల నుండి సాయింత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ చేయాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్నవారు ఆన్లైన్ లో తమ పేరును cowin. gov. in నందు నమోదు చేసుకొని ఆధార్ లేదా మొబైల్ ద్వారా రిజిస్టర్ చేయించుకొని వచ్చిన ఓ.టి.పి.నమోదు చేశాక పేరు, వయసు,లింగం మొదలైన వివరాలు తెలిపి అనుకూలమైన తేది, సమయం, వ్యాక్సినేషన్ సెంటర్ ను ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. 

వాజేడు, వెంకటాపురం ప్రజల కూడా ఏరియా ఆసుపత్రికి రావలసిందిగా కలెక్టర్ కోరారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యాం సుందర్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

కె.మహేందర్, సత్యం న్యూస్

Related posts

పుట్టు చికెన్ కూర వండిన హీరోయిన్ రష్మిక మందాన

Satyam NEWS

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 21న కలెక్టరేట్ల ముట్టడి

Bhavani

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడికి వేణుగాన అలంకారం

Satyam NEWS

Leave a Comment