28.7 C
Hyderabad
May 6, 2024 10: 21 AM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నర్సింగ్ ఆఫీసర్స్

#NarsingOfficers

నర్సుల సమస్యల పరిష్కారంలో అధికార విపక్ష పార్టీలన్నీ విఫలమయ్యాయి అన్న భావనలో ఉన్న నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

తొలుత NOTA  తో నిరసన తెలియజేయాలని అనుకున్నా, రెండు రోజుల క్రితం సమావేశమై తర్వాత రెండు స్థానాలకు  నర్సింగ్ అభ్యర్థులను నిలబెట్టి రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.

 నల్లగొండ,ఖమ్మం,వరంగల్, నుండి శ్రీను రాథోడ్, హైదరాబాద్, రంగారెడ్డి,మహబూబ్ నగర్ నుండి ప్రొఫెసర్ రాజేశ్వరి పోటీకి దిగుతున్నారు.

వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో సుమారు 10 వేల మంది నర్సింగ్  గ్రాడ్యుయేట్లకు ఓట్లు ఉన్నాయని నర్సింగ్  అసోసియేషన్ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని ఎమ్మెల్సీ నియోజక వర్గంలో 30 వేల మంది   నర్సింగ్  గ్రాడ్యుయేట్ల గా ఉన్నారని ఇక్కడ నుంచి మహిళ  అభ్యర్థిని నిలబెటుతున్నట్లు నర్సింగ్ సంఘ అసోసియేషన్ ప్రకటించింది.  

2017 నవంబర్ నాటికి  బియస్సి నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్విఫరీ కోర్సు పూర్తిచేసుకున్నవారు ఓటరు నమోదు ప్రక్రియ చేసుకోవాలని కోరుతున్నారు.

ట్రైన్డ్ నర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ సహా పలు సంఘాలు వీరికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

Related posts

తిరుమలలో రేపు శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు

Satyam NEWS

అతిధి అధ్యాపకుడి ని హత్య చేసిన ప్రభుత్వం

Satyam NEWS

భాషా సంస్కృతులను కాపాడుకోవాలి

Bhavani

Leave a Comment