29.7 C
Hyderabad
May 2, 2024 03: 29 AM
Slider నెల్లూరు

వి ఎస్ యు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డ్స్

#vikramsimhapuri

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ముగ్గురు వాలంటీర్లకు రాష్ట్ర మరియు ఒక వాలంటీర్ జాతీయ స్థాయి అవార్డ్ కు ఎంపిక అయినట్లు సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ఒక పత్రికా ప్రకటన లో తెలియచేశారు. ఏటా ఉత్తమ సేవలందించిన తొమ్మిది మంది వాలంటీర్లకు  రాష్ట్ర మరియు జాతీయ స్థాయి లో ఈ అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది అని అన్నారు. 

కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల కు చెందిన చుక్కల పార్థసారథి (2019-2020 విద్యాసంవత్సరం కు), పి. చైతన్య మరియు జగన్ డిగ్రీ కళాశాల కు చెందిన సాత్వికా  2021-2022 విద్యాసంవత్సరం కు), రాష్ట్ర స్థాయి అవార్డ్స్ కు ఏంపికాయ్యారు. 2020-2021 విద్యాసంత్సరం కు చుక్కల పార్థసారథి జాతీయ స్థాయి అవార్డ్ కు ఎంపికయ్యారు.

విశ్వవిద్యాలయం ఉపకులతి ఆచార్య జి యం సుందరవల్లీ,  రిజిస్ట్రార్ డా. పి. రామచంద్రా రెడ్డి ఎంపికయిన వాలంటీర్లకు అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 535 పైగా విశ్వవిద్యాలయాలలో ఎన్ ఎస్ ఎస్ నడుస్తూ 20 లక్షలకు పైగా ఉన్న వాలంటీర్ల లలో జాతీయ స్థాయిలో ఎంపిక అయిన 9 లో మన వాలంటీర్ ఒకరు వుండటం గర్వించ వలసిన విషయం అన్నారు.

అలాగే సుమారు రెండు లక్షల ఇరవై వేల పైచిలుకు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఉన్న ఆంధ్రరాష్ట్రం నుంచి తొమ్మిది మంది  ఎంపికైన వాలంటీర్లలో ఇద్దరు మన విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి అవార్డు కు ఎంపిక అవ్వడం అందరూ గర్వించదగ్గ విషయం అన్నారు. నిజంగా ఎంపికైన వాలంటీర్లందరూ ఎంతో కస్టపడిన వాళ్ళే . విశ్వవిద్యాలయం చేపట్టిన ప్రతి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నవారే… నిజాయితీగా కష్టపడి పనిచేసే వారెవ్వరి శ్రమ వృధా కాదు అని మరోసారి నిరూపించారు.

ఒకేసారి ఇన్ని అవార్డ్స రావటం విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ సేవాకార్యక్రమాలు భేష్ అని కొనియాడారు. ఎంపిక అయిన ముగ్గురు సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన వారే. కష్టే ఫలి అనే నానుడికి వీరే తార్కాణం అని రిజిస్ట్రార్ డా. పి. రామచంద్రారెడ్డి అన్నారు.

Related posts

కొత్త‌ జిల్లా ఏర్పాటు ఉన్న‌ప్ప‌టికీ విజయనగరం జిల్లా కేంద్రంలోనే ఉగాది వేడుక‌లు

Satyam NEWS

నెలనెలా విద్యుత్తు చార్జీల సవరణ దుర్మార్గం

Bhavani

ఫేర్ వెల్: ఎస్ ఐ దశరథ్ కు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

Leave a Comment