32.2 C
Hyderabad
May 9, 2024 20: 26 PM
Slider గుంటూరు

సీపీఎస్ రద్దుపై మాట తప్పి మడం తిప్పిన సిఎం జగన్

#NavataramParty

అధికారంలోకి రాగానే  వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన  జగన్ ముఖ్యమంత్రి అయి రెండేళ్ళ గరిష్ట కాలం పూర్తిఅయినా ఇంతవరకూ సీపీఎస్ రద్దు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల భవిష్యత్తు నాశనం చేశారు అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.

పాత విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రంలో నెలకొన్న ఉద్యోగుల ఉద్యమం పై నీళ్లు చల్లిన జగన్ ఉద్యోగుల కు న్యాయం చేయకుండా మోసం చేసారని ఆయన విమర్శించారు. ఉద్యోగుల కోసం వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ మాటతప్పి మడమతిప్పడం సరికాదన్నారు.

ఉద్యోగుల కోసం నవతరం పార్టీ ఉద్యమం ఉవ్వెత్తున చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుందని తెలిపారు.రాష్ట్రంలో ఉన్న అన్నీ ఉద్యోగ సంఘాలు,పూర్వ ఉద్యోగుల సంఘం నేతలను కలసి సూచనలను స్వీకరించి ఉద్యమం చేసి జగన్ మెడలు వంచి సీపీఎస్ రద్దు చేయిస్తామని తెలిపారు.

కాలయాపన కమిటీని వేసి జగన్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రావు సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

Related posts

చంద్రబాబు నాయుడు కు రాజంపేట ఎమ్మెల్యే మేడా ఛాలెంజ్

Satyam NEWS

ఓట్ ప్లీజ్: ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తాం ఆశీర్వదించండి

Satyam NEWS

బాన్సువాడ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

Satyam NEWS

Leave a Comment