26.7 C
Hyderabad
May 3, 2024 07: 55 AM
Slider ఆదిలాబాద్

సగం కాలిన కరోనా శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

#Dead Body

కరోనా శవాల అంత్యక్రియలలో ప్రభుత్వం విఫలమైందని, కరోనా శవాన్ని కుక్కలు పీక్కుతినడం చాలా  దారుణం అని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు ఆసుపత్రిలో కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు.

కరోనాతో చనిపోతే శవాలను కాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం సరిపడా కట్టెలను కూడా అందిచలేకపోతుందన్నారు. కరోనా వార్డులో రోగులకు సమయానికి ఆహారం కూడా అందించలేకపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

కరోనా తో చనిపోయిన వారి శవాలను వారి కుటుంబాలకు అప్పజెప్పాలని, ఇలా కుదరని సమయంలో తమకు అప్పగిస్తే అన్ని లాంచనాలతో కరోనా నియమాలను పాటిస్తు దహనం లేదా ఖననం చేస్తానని తెలియజేశారు.

ఈ విషయాన్ని ఇక్కడి ప్రభుత్వం, అధికారులతో  పలుమార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కరోనా రోగులను నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షకీల్, రాహుల్,రసూల్, ఖుర్షీద్, జిలాని, అజిజ్, షోహెబ్, నసీర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీసీ కెమెరాల సాక్షిగా విజయనగరం జిల్లా లో సాగుతున్న పోలింగ్

Satyam NEWS

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాకు పరాభవం

Satyam NEWS

సమష్టి బాధ్యతలో హెచ్ఎండిఏ ముందంజ

Bhavani

Leave a Comment