23.7 C
Hyderabad
May 8, 2024 04: 55 AM
Slider నల్గొండ

రైస్ మిల్లుల యజమానులు,కార్మికుల మధ్య జరిగిన చర్చలు విఫలం

#TNTUC

టిఎన్టియుసీ, బిఆర్ఎస్ కెవి,ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాల జాయింట్ చర్చలు 23వ,తేదీన సోమవారం మిల్లర్స్ భవనంలో రాత్రి పొద్దు పోయేంత వరకు జరిగిన సుదీర్ఘంగా జరిగిన చర్చలు విఫలం అయినాయని టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోశపతి తెలిపారు.

హుజూర్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యాజమాన్యం,కార్మిక నాయకుల మధ్య జరిగిన వేతన చర్చల్లో వేతనంతో పాటు పిఎఫ్,ఈఎస్ఐ అల్వెన్స్ లపై చర్చలు జరిగాయని,ఇందులో ప్రతి రైస్ మిల్ కార్మికుడికి ఉన్న వేతనంపై నెలకి 4,000 రూపాయలు పెంచాలని కార్మికులు కోరగా యాజమాన్యం సుదీర్ఘ చర్చల అనంతరం 1,500 రూపాయలు పెంచడానికి ముందుకు వచ్చారని,దీనితో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీనరసింహారావు,గజ్జి ప్రభాకర్,కుక్కడపు రామ్మోహన్ రావు,యూనియన్ ప్రతినిధులు టిఆర్ఎస్కెవి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్,ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య,సిఐటియు నుంచి నాగారపు పాండు,టి ఎన్ టి యు సి నుండి ఆకం కోటేశ్వరరావు,కొండపల్లి వెంకన్న,సల్వాది సైదులు,చింతకాయల మల్లయ్య,తిరపయ్య,పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

స్టాఫ్ నర్స్ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల

Bhavani

జర్మనీలో నరేంద్ర మోడీ: ‘‘భారత్ వెలిగిపోతున్నది’’

Satyam NEWS

గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది

Satyam NEWS

Leave a Comment