31.7 C
Hyderabad
May 6, 2024 23: 55 PM
Slider ముఖ్యంశాలు

స్టాఫ్ నర్స్ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల

#Preliminary Key

ఈ నెల 2న జరిగిన స్టాఫ్‌ నర్స్‌ ఎగ్జామ్‌ ప్రిలిమినరీ ‘కీ’ని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిగిన ఈ పరీక్షకు 38,674 మంది నర్సులు హాజరయ్యారు. ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం ఏదో, అభ్యర్థులు ఏ సమాధానాన్ని ఎంచుకున్నారో కూడా బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు.

అభ్యర్థులు తమ హాల్‌ టికెట్‌ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేసి ఎన్ని మార్కులు వస్తున్నాయో చెక్‌ చేసుకోవచ్చునని బోర్డు ప్రకటించింది. ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా బోర్డు వెబ్‌సైట్‌లో లేవనెత్తాలని సూచించింది. ఇందుకు సంబంధించిన వెబ్‌ లింకును వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది కీ విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది.

Related posts

కరోనా ఎలర్ట్: క్వారంటైన్ కేంద్రానికి తీసుకువెళ్లే సిబ్బందికి ఇబ్బంది

Satyam NEWS

Hats off: అవయవ దాత కు ఘన సన్మానం

Satyam NEWS

టెస్టింగ్: హైదరాబాద్ కు వచ్చిన కరోనా కిట్లు

Satyam NEWS

Leave a Comment