31.7 C
Hyderabad
May 7, 2024 01: 40 AM
Slider నల్గొండ

వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యుడు శానంపూడి

హుజుర్ నగర్ మార్కెట్ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రములో నలభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు సైదిరెడ్డి మాట్లాడుతూ హుజుర్ నగర్ కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్ ప్రారంభించుకున్నందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీకి,రైతులకు,రైతు సంఘాలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

హుజూర్ నగర్ పట్టణానికి ఈ ఎస్ ఐ హాస్పిటల్ మంజరై పూర్తి స్థాయిలో సిబ్బంది,మౌలిక సౌకర్యాలు వచ్చినా ప్రభుత్వ భవనం లేని కారణంగా ప్రారంభించు కోలేక పోయామని,ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ నూతన కార్యాలయాన్ని నిర్మించుకుని ప్రారంభించు కున్నాం కనుక పాత వ్యవసాయ భవనాన్ని ఈ ఎస్ ఐ హాస్పిటల్ కి కేటాయిస్తూ త్వరలో ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభించబోతున్నామని,ప్రస్తుతము ఈఎస్ ఐ డిస్పెన్సరీ నడుస్తుదని, త్వరలో డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని కూడా ప్రారంభించబోతునారని అన్నారు.

కార్మికులందరికీ మంచి వైద్య సదుపాయాలతో అధునాతన చికిత్సలతో ఈ ఎస్ ఐ హాస్పిటల్ ని పూర్తిస్థాయిలో పాత వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ప్రారంభించబోతున్నామని అట్టి కార్యక్రమనికి రాష్ట్రం నుండి మంత్రులు కూడా హాజరౌతారని తెలిపారు.
హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తంలో అభివృద్ధిని శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు.

కోర్టు కేసులు ఆటంకాలు లేకుంటే 8 నెలల క్రిందటే పూర్తి స్థాయిలో పనులు పూర్తి అయి ఉండేవని,మొదట ఫండ్స్ తెచ్చి పనులు ప్రారంభిస్తే కోర్టులో కేసులు వేసి నిలుపుదల చేశారని, న్యాయస్థానాలు విచారించి కేసులు కొట్టేస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని అన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని,అభివృద్ధి నిరోధక చర్యలు ప్రజలు గమనిస్తున్నారని,గుంతల మయమైన రోడ్ల దుస్థితికి కారణం కేవలం ప్రతిపక్ష కేసుల బ్యాచ్ అని ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు.

రాబోయే 6 నెలలో హుజుర్ నగర్ ముఖ చిత్రం పూర్తి గా మర్చివేయ బోతున్నామని అన్నారు.హుజుర్ నగర్ బైపాస్ తొందరలో పూర్తి చేస్తామని,70 రోజులలో మినీ ట్యాంక్ బండ్ పూర్తి చేస్తామని,అక్కడ ముందు ముందు బోటింగ్ కూడా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా త్వరలో పూర్తౌతుందని,మినీ స్టేడియం, పార్క్ లు కూడా ముందు ముందు నిర్మించబోతున్నామని తెలిపారు.

ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు చేసే ఆటంకాలు కూడా సాగనివ్వమని,రైతులు బొరాలలో తెస్తే అదేవిదంగా వెబ్రిడ్జిల ద్వారా తూకాలు వేయించి కొనేలా మాట్లాడుతానని,
పోయిన సారి చేసినట్టు రైతులకు టోకెన్స్ ఇచ్చి దాని మీద తేదీ,రైతు, మిల్లు పేరు వివరాలతో ఇస్తే ఇబ్బందులు ఉండవని,రైతులు కూడా అందరూ ఒకేసారి కోతలు కోసి తేకుండా కొంచం చూసుకొని పంటను తెచ్చినట్లైతే మిల్లుల వద్ద ఒత్తిడి లేకుండా చేద్దామని మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి తరుగు లేకుండా చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ పరిధిలోని ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

9న ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి

Satyam NEWS

వ్యక్తి ఆరాధనకు పరాకాష్ట: దుర్గా మాత పక్కన దీదీ విగ్రహం

Satyam NEWS

నా రక్తం దారబోసి మీకు సేవ చేస్తా…

Satyam NEWS

Leave a Comment