26.2 C
Hyderabad
May 10, 2024 21: 22 PM
Slider ముఖ్యంశాలు

బీసీల కోసం 28 కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

#BC Welfare AP

బీసీ సామాజిక వర్గం సంక్షేమానికి, వారి అభ్యున్నతి కోసం 28 కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి మంచి చేయాలనే ఉద్దేశంతో 28 కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయమని అన్నారు. రాష్ట్రంలో43 వేల కోట్ల రూపాయల వరకు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు తీసుకువస్తే అందులో 22 వేల కోట్ల రూపాయల వరకు బిసి సామాజిక వర్గం అభివృద్ధికే ఇచ్చిన ఘనత సీఎం జగన్ కి మాత్రమే చెల్లుతుందన్నారు.

బిసి సామాజిక వర్గం లో 30 వేల జనాభాకు మించిన ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, అందులో కార్పొరేషన్ అధ్యక్షుని, బోర్డ్ మెంబర్ ని ఏర్పాటు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక నిర్వహించామని అన్నారు. బీసీలలో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్న కష్టనష్టాలను తెలుసుకొని ఆ కులానికి చేయాల్సిన మంచి కార్యక్రమాలు చేసేందుకు కార్పొరేషన్ లను ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించడం పట్ల బీసీ సామాజికవర్గం తరఫున సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు, కృతజ్ఞతలను మంత్రి తెలిపారు.

Related posts

రేప్:తాత మేనమామలే కామాందులై యువతిని చెరుస్తూ

Satyam NEWS

హింసామార్గం వీడండి అహింసాపద్ధతులను అవలంబించండి

Satyam NEWS

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయం

Satyam NEWS

Leave a Comment