38.2 C
Hyderabad
April 29, 2024 19: 27 PM
Slider నల్గొండ

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయం

#DevarakondaSportsAssociation

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారులకు, సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని DSDO మక్బూల్ అహ్మద్ అన్నారు.

ఆయన నేడు స్పోర్ట్స్ భవనానికి వచ్చి దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న డాన్స్ శిక్షణ, తెక్వండో శిక్షణ తదితర కార్యక్రమాలను పరిశీలించారు. కరోనా సమయంలో వారు చేస్తున్న సేవలు అభినందనీయమని మక్బూల్  అహ్మద్ అన్నారు.

అనంతరం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు N V T, DSDO మేనేజర్ ధనంజయ్య, కోశాధికారి కృష్ణకిషోర్ తో కలసి ఔట్ డోర్ స్టేడియం పనులు, ఇండోర్ స్టేడియం స్థలం పరిశీలించారు. అతిత్వరలో ఇండోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమౌతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, ఉమా మహేష్, పీడీ నాగేశ్వరరావు, పంతులాల్, లెండలా మోహన్ ప్రసన్న భాస్కర్ రెడ్డి, జె చంద్రయ్య, అమర్, కరుణాకర్ తెక్వండో కోచ్ వి సురేష్, డాన్స్ మాస్టర్ క్రాంతి, లక్ష్మన్, రాపోలు నిరంజన్, తాళ్ల సురేష్,స్పోర్ట్స్ సభ్యలు అందరూ పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధి కమిటీలకు జెడ్పీటీసీ లు ఇక శాశ్వత సభ్యులు

Satyam NEWS

What Is Oversold

Bhavani

దేశంలో బలమైన శక్తి గా బిఆర్ఎస్

Bhavani

Leave a Comment