36.2 C
Hyderabad
April 27, 2024 21: 56 PM
Slider ఆదిలాబాద్

కార్మికుల పొట్టకొడుతున్న సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం

#Sirpur Paper Mill

షట్ డౌన్ పేరుతో పరిశ్రమను మూసేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల రాయితీలు పొందిన సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నది. ఇదే విషయాన్ని కార్మికులు జిల్లా కలెక్టర్ దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దృష్టికి తీసుకువచ్చారు. 2014 సెప్టెంబర్ 27న పేపర్ మిల్లును మూసేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్, స్థానిక శాసనసభ్యుడు కోనేరు కోనప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మళ్లీ 2018 ఆగస్టు 2న మిల్లు తెరిచేలా చేశారు. కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మిల్లు తెరిచే సమయంలో జె కె యాజమాన్యానికి వేల కోట్ల రూపాయల రాయితీలు కల్పించింది.

మిల్లు తిరిగి ప్రారంభమై రెండేళ్లు గడిచినా కూడా ఇప్పటికీ పర్మినెంటు కార్మికులను కూడా పూర్తి స్థాయిలో విధుల్లోకి యాజమాన్యం తీసుకోలేదు. 2017లో కార్మికులందరికి విధుల్లో తీసుకునే కారణంతో ఫిట్ నెస్ పరీక్ష కూడా నిర్వహించారు. అయినా ఇప్పటికీ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల తాము ఆకలితో పస్తులుంటున్నామని వారు అన్నారు. ఈ మేరకు వారు నేడు కలెక్టర్ కు స్థానిక ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు.

సంవత్సరాలుగా కార్మికులను తిప్పుకుంటూ కార్మికులను మానసిక వేదనకు గురి చేస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పర్మినెంటు కార్మికులలో కొందరిని తీసుకున్నా వారికి 2008 నాటి జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. బయటి రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న వారిని మాత్రం నెలకు 30 వేల రూపాయల భారీ వేతనాన్ని యాజమాన్యం చెల్లిస్తున్నదని కార్మికులు వివరించారు.

అదేమని అడిగిన కార్మికులకు డ్యూటీలలో కోతలు విధించి కరోనా నష్టాల పేరుతో జీతంలో కోతలు విధిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయకపోతే తాము ఆకలిచావులకు గురికావాల్సి వస్తుందని కార్మికులు అంటున్నారు.

Related posts

బస్టాండ్ లో నాటు బాంబు కలకలం

Murali Krishna

డా.బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం నమూనా విడుదల

Bhavani

థాంక్ గాడ్: ఊపిరి పీల్చుకున్న నాగర్ కర్నూల్

Satyam NEWS

Leave a Comment