29.7 C
Hyderabad
May 6, 2024 05: 22 AM
Slider జాతీయం

న్యూ బిగినింగ్: విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం

#Nirmala Seetaraman PC

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో దేశంలోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రణాళికను కూడా ప్రకటించారు. రాబోయే రోజుల్లో కార్పొరేట్ కాలేజీలు, ఎక్కువ మంది విద్యార్ధులు గుమికూడి ఉండే కాలేజీలకు కాలం చెల్లినట్లే భావించాల్సి ఉంటుంది.

దేశం మొత్తం ఒకే విద్యా విధానం ఉండేలా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన నూతన విద్యావిధానంలోని ముఖ్యంశాలు: 1.ఇంటర్నెట్ అవకాశం లేని వారికి సహాయంగా స్వయంప్రభ డి.టి.హెచ్. ఛానళ్ళు.

పాఠశాల విద్య కోసం ఇప్పటికే 3 చానెళ్లను కేటాయించారు. ఇప్పుడు మరో 12 చానెళ్లను జత చేయమన్నారు.2. స్కైప్ ద్వారా నిపుణుల ఇళ్ళ నుండి ఈ ఛానెళ్ల పై పరస్పర చర్చా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అవకాశం కల్పించారు.

3.  ఈ ఛానళ్ళను  ఎక్కువ మంది చూసే అవకాశం కోసం టాటా స్కై, ఎయిర్ టెల్ వంటి ప్రైవేటు డి.టి.హెచ్. ఆపరేటర్ లతో కూడా ఒప్పందం. 4.  స్వయంప్రభ ఛానెళ్లపై ప్రతి రోజు 4 గంటలపాటు తమ విద్య సంబంధమైన విషయాలను ప్రసారం చేసేందుకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో సమన్వయం. 5  దీక్ష వేదికపై మార్చి 24వ తేదీ నుండి ఇప్పటివరకు  60 కోట్ల వరకు స్పందనలు వచ్చాయి. ఈ-పాఠశాల కు 200 కొత్త పాఠ్య పుస్తకాలను చేర్చారు.

Related posts

రాజంపేట లో ఆ రెండు సామాజిక వర్గాల దే ఆధిపత్యం.!

Satyam NEWS

మర్కజ్ కారణంగా తెలంగాణలో పెరిగిన కరోనా

Satyam NEWS

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నెల్లూరు రెడ్ల తిరుగుబాటు

Bhavani

Leave a Comment