34.7 C
Hyderabad
May 5, 2024 01: 55 AM
Slider ముఖ్యంశాలు

ఐఐటీ-జేఈఈ సమగ్ర సమాచారంపై ప్రత్యేక బుక్ లెట్

iit jee book

ఐఐటీ-జేఈఈ కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్, విద్యా రంగ సలహాదారుడు కే.లలిత్ కుమార్ పుస్తక రూపంలో తీసుకువస్తున్నారు. ఐఐటీ -జేఈఈ కి సంబంధించి 11 సంవత్సరాల అనుభవంతో ఆయన తీసుకువస్తున్న ఈ పుస్తకం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కోసం నిర్దేశించింది.

2014 నుండి 2019  సంవత్సరాల మధ్య కాలంలో జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల వివరాలు ఇందులో ఉంటాయి. మార్కులు ర్యాంకుల వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. మార్కులు ర్యాంకులు చూసుకున్న తర్వాత సీట్లు కేటాయింపు విషయాన్ని ఇందులో వివరించారు. అదే విధంగా ప్రశ్నల కేటాయింపు, కట్ ఆఫ్ మార్కులు, రిజర్వేషన్స్ వారీగా సీట్లు కేటాయింపు తదితర సమగ్ర సమాచారాన్నిఇందులో అందచేస్తున్నారు.

ఈ నెల 13న ప్రముఖ ఐఐటీ -జేఈఈ ఫోరం సహకారం తో పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్ విశేష అనుభవం ఉన్న కే. లలిత్ కుమార్ తన అనుభవాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించారు.

Related posts

రైతుల నుంచి ధాన్యం సేకరించే వాహనాలకు జియో ట్యాగింగ్

Satyam NEWS

హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్

Satyam NEWS

ఆత్మనిర్భర్ భారత్ తో పురోగమిస్తున్న నావికాదళం

Satyam NEWS

Leave a Comment