38.2 C
Hyderabad
May 3, 2024 22: 41 PM
Slider క్రీడలు

నిరసన ప్రదర్శన నుంచి వైదొలగిన సాక్షి

#sakshi

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. 2016 రియో ​​ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ నిరసన ప్రదర్శన నుంచి వైదొలిగింది. ఆమె రైల్వేలో తన ఉద్యోగానికి తిరిగి వచ్చింది. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి సాక్షి వైదొలగడం ఉద్యమానికి పెద్ద నష్టంగా భావిస్తున్నారు. బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ కూడా ఉద్యమం నుండి వైదొలిగి తమ ఉద్యోగాలు వెళ్లిపోతారనే వార్తలు వెలువడుతున్నాయి. శనివారం రాత్రి సాక్షి, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని హోంమంత్రిని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఎలాంటి వివక్ష లేకుండా పూర్తి విచారణకు హోంమంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అమిత్ షా అన్నారు.

Related posts

ముందస్తు ఏర్పాట్లు: ‘‘మూడు’’ మరింత ముందుకు

Satyam NEWS

చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితం నాశనం చేసుకోవద్దు

Satyam NEWS

కొల్లాపూర్ లో మరొక్క సారి జూపల్లి ప్రభంజనం

Satyam NEWS

Leave a Comment