28.7 C
Hyderabad
April 28, 2024 05: 37 AM
Slider సంపాదకీయం

ముందస్తు ఏర్పాట్లు: ‘‘మూడు’’ మరింత ముందుకు

#jagan

ఐ ప్యాక్ రిపోర్టు ఆధారంగా మూడు రాజధానుల అంశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ అధినాయకత్వం అడుగులు వేస్తుంది. మూడు రాజధానుల పేరుతో ప్రజలలోకి వెళితే ఇప్పటి వరకూ తమపై వచ్చిన పరిపాలనావైఫల్యాలను పక్కదోవ పట్టించవచ్చునని వైసీపీ భావిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. మూడు రాజధానుల పేరుతో కాకుండా విశాఖ రాజధాని అనే విధంగా అక్కడి వైసీపీ నాయకులు మాట్లాడటం పార్టీకి మరింత ఊపునిస్తున్నదని ఐ ప్యాక్ అభిప్రాయపడిందని చెబుతున్నారు.

ఈ కారణంగానే విశాఖ ఆందోళన అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని వైసీపీ భావిస్తున్నది. అదే విధంగా నాలుగు అంచుల ప్రణాళిక తో ఉత్తరాంధ్ర లో మూడు రాజధానులు ఉద్యమం ఉదృతం చేసేలా ప్రణాళిక రచించింది. ప్రజల మైండ్ లో ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టడం వల్ల వైసీపీకి ఎంతో లాభం చేకూరుతుందని ఐ ప్యాక్ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. 3 రాజధానులు అంటూనే విశాఖ నే రాజధాని చేస్తాం అనే విధంగా అక్కడి ప్రజలకు వివరించి చెప్పాలని అనుకుంటున్నారు.

విశాఖ రాజధాని కావాల్సిన అవసరం పై ఆవాహన కల్పించి ప్రజలను ఉద్యమం లో మమేకం చేసేలా మంత్రులు, ఎం.ఎల్.ఏ, వైసీపీనాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా రాయలసీమ లో సైతం  ఉద్యమం చేస్తే ఎలా ఉంటుందో సమాలోచన లు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అందే కాకుండా ఐ ప్యాక్ ఇచ్చిన రిపోర్ట్ జగన్ చేతికి రావడం తో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. దీపావళి తర్వాత 4 కీలక నిర్ణయాలు జగన్ వెల్లడించానున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆయన చెప్పబోయే అంశాలలో ముందస్తు ఎన్నికల విషయం కూడా ఉంటుందని అనుకుంటున్నారు. ప్రజల దృష్టిలో మూడు రాజధానుల అంశం ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రభుత్వం పై ఇప్పటి వరకూ వచ్చిన విమర్శలు పక్కకు వెళ్తున్నట్లు ఐ ప్యాక్ మీడియా గుర్తించింది. ఈ కారణంతో ఇదే అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ముందస్తు ఎన్నికలకు వెళితే ఇక ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ లేకుండా చేయవచ్చునని రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.

మూడు రాజధానుల విషయాన్ని ప్రజల్లో ఎంత విస్తృతంగా తీసుకువెళితే ప్రతిపక్షాలు కూడా అంతగా బలహీనపడతాయని వైసీపీ అధిష్టానం భావిస్తున్నది. అందువల్ల రాబోయే రోజుల్లో మూడు రాజధానుల అంశం మరింత ముందుకు తీసుకువెళ్లేందుకే వైసీపీ ప్రాధాన్యత ఇస్తున్నది. ఇది సాధారణంగా కాకుండా సెంటిమెంటు ఉవ్వెత్తున ఎగసిపడే స్థాయికి తీసుకువెళ్లాలని కూడా అనుకుంటున్నారు.

Related posts

తెలంగాణలోని చాలా ప్రాంతాలకు వానగండం

Satyam NEWS

40 పైసలు ఇవ్వమంటే రూ. 4000 కట్టమన్నారు

Sub Editor 2

మానవ హక్కుల సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా గుండ బాలమోహన్

Satyam NEWS

Leave a Comment