29.7 C
Hyderabad
April 29, 2024 07: 20 AM
Slider మహబూబ్ నగర్

చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితం నాశనం చేసుకోవద్దు

#wanaparthypolice

గంజాయి, డ్రగ్స్,  ఇతర మత్తుపదార్థాల నియంత్రణ గురించిన అవగాహన కార్యక్రమం నేడు వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగింది. వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు  ఆదేశాల మేరకు  వనపర్తి డీఎస్పీ కెఎం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వనపర్తి సీఐ ప్రవీణ్ కుమార్, వనపర్తి రూరల్ ఎస్సై చంద్రమోహన్ రావు నిర్వహించారు. 

సంగం పంక్షన్ హలులో జరిగిన ఈ కార్యక్రమంలో వనపర్తి  పరిధిలోని మున్సిపల్ కౌన్సిలర్లు, అన్నిగ్రామాల, ఎంపీటీసీలు,సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులకు,వివిధ సంఘాల నాయకులకు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దానిపై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా తమకు ఇష్టమైన రంగాల్లో రాణించాలని డిఎస్పీ అన్నారు. గంజాయి మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకోవద్దన్నారు. గంజాయికి బానిస అయి ఎందరో యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.

గంజాయి సాగు, నిల్వ, రవాణా, సేవించడం చట్టరీత్యా నేరమన్నారు. తమ గ్రామంలో ఎవరైనా గంజాయి  కలిగి ఉన్నా, సరఫరా చేసిన సేవించినా 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి తగిన పారితోషికం అందివ్వనున్నట్లు వివరించారు.

గ్రామాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో, అసైండ్ భూముల్లో గాని గంజాయి మొక్కలు 4 దొరికిన సంబంధీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పిడి,యాక్ట్ కేసు నమోదు చేస్తామని తెలిపారు.  డ్రగ్స్ ,గంజాయి,గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ ను  సమూలంగా అరికట్టడంలో ప్రజాప్రతినిధులతో పాటు గ్రామప్రజలపై కూడా బాధ్యత ఉందని, జిల్లాలో ఎక్కడైనా వాటి సరఫరా,ఉత్పత్తులు  జరిగిన, ఎవరైనా వినియోగిస్తున్న వెంటనే ప్రజలు బాధ్యతగా భావించి సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్,లోకనాథ్ రెడ్డి, వనపర్తి మున్సిపల్ చైర్మన్,గట్టుయాదవ్, మున్సిపల్ వైస్ ఛైర్మన్, వాకిటి శ్రీధర్, జిల్లా గొర్ల కాపరులు సంగం జిల్లా అధ్యక్షుడు,కురుమూర్తి యాదవ్, వనపర్తి సీఐ,ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ సీఐ,సుభాష్ చందర్ రావు, వనపర్తి రూరల్ ఎస్సై, చంద్రమోహన్ రావు, వనపర్తి పట్టణ 2వ ఎస్సై,శివకుమార్, ఎస్పీ పీఆర్వో, రాజగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, అన్నిగ్రామాల, , ఎంపీటీసీలు,సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులకు,వివిధ సంఘాల నాయకులకు, అధికారులు  సిబ్బంది పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యంన్యూస్.నెట్

Related posts

పేద పూజారి కుమార్తె ఇప్పుడు భారత దేశ ఆశాజ్యోతి

Satyam NEWS

పార్టీలకు అతీతంగా కుల సంఘాల అభివృద్ధికి కృషి

Satyam NEWS

జాతిని మోసం చేస్తున్న నరేంద్ర మోడీ

Murali Krishna

Leave a Comment