33.2 C
Hyderabad
May 4, 2024 02: 10 AM
Slider సంపాదకీయం

కొత్త స్వామి మోజులో పాత స్వామికి పరాభవం

#saradapeetham

తనను ముఖ్యమంత్రిని చేయడంలో కీలకపాత్ర పోషించిన విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జగన్ దూరం పెట్టారా? కొత్త స్వామి మోజులో పడి వదిలేశారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొత్త స్వామి జగన్ కు దగ్గర కావడం, పాత స్వామి దూరం కావడం స్పష్టంగా కనిపిస్తున్నది. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం తలపెట్టారు.

ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్న ఈ రాజశ్యామల యాగానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిని ఆహ్వానించకపోవడంతోనే సీఎం ఆయనను దూరం పెడుతున్నారని తాజాగా స్పష్టం అయింది. గత కొంతకాలంగా సీఎం జగన్‌కు, స్వరూపానందేంద్రకు మధ్య కొంత దూరం పెరిగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతుంది.

అందువల్లే ఇటీవలి కాలంలో విశాఖ శారద పీఠం వైపు చూడటం లేదనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు ఇటీవల కర్ణాటకలోని మైసూరుకు చెందిన విజయ కుమార్ స్వామి తాడేపల్లిలోని సీఎం  జగన్ నివాసానికి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి వివిధ రకాల ప్రచాలు జరగగా వైఎస్ జగన్ బాబాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ఒక స్పష్టమైన ప్రకటన చేశారు.

విజయ్ కుమార్ స్వామి వచ్చి సీఎం జగన్‌కు ఆశీర్వాదం అందించారని తెలిపారు. తాను ఎంతో మంది స్వామిజీలను తీసుకొచ్చి జగన్‌కు ఆశీర్వాదాలు ఇప్పిస్తుంటానని కూడా చెప్పారు. స్వరూపానందేంద్ర విషయానికి వస్తే ఆయనతో జగన్ కు మంచి సత్సబంధాలు ఉండేవి. 2019  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన ఆశీస్సులే ప్రధాన కారణం.

2019కు ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సీఎం చంద్రబాబుపై స్వరూపానందేంద్ర విమర్శలు వర్షం కురిపించేవారు. పలు విషయాల్లో చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అదే సమయంలో జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా  పేరు తెచ్చుకున్నారు.

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో  2016లో ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో కొన్ని పూజలు నిర్వహించారు. ఈ పూజలు అన్ని స్వరూపానందేంద్ర సమక్షంలోనే జరిగాయి. జగన్ ను హిందువుగా మార్చినట్లు ఎక్కడా చెప్పలేదు కానీ అక్కడ ఆయన జరిపించిన క్రతువు ప్రజల్లో అలాంటి భావన ఏర్పరచింది.

అంతకు ముందు ఎన్నికలలో జగన్ మతంపై ఉన్న అభిప్రాయాలు చెరిగిపోయేలా స్వరూపానందేంద్ర పకడ్బందిగా స్క్రిప్టు అమలు చేశారు.  అప్పటి నుంచి జగన్, స్వరూపానందేంద్రల మధ్య సంబంధాలు మరింతగా పెరిగాయి. ఆ తర్వాత కూడా జగన్ కోసం స్వరూపానందేంద్ర కొన్ని పూజలు చేశారు.

విజయవాడలో రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని ఆలయాలను కూల్చివేయాలని ఆదేశించినందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై స్వరూపానందేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఒక మతానికి చెందిన కొంత శాతం ఓటర్లను టీడీపీకి దూరం చేయడంలో స్వరూపానందేంద్ర పాత్ర పోషించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి.

2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొద్ది రోజులకే సీఎం జగన్.. విశాఖ శారద పీఠంకు వెళ్లి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో స్వరూపానందేంద్ర స్వామి సీఎం జగన్‌కు ఆత్మీయంగా ముద్దులు ఇచ్చారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా సీఎం జగన్ విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు.

అంతే కాకుండా మంత్రులు అధికారులు పెద్ద ఎత్తున వెళ్లి స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకునేవారు. ఆ రోజులు ఇప్పుడు ఖతం అయిపోయాయి. కొత్త స్వామి రాకతో స్వరూపానందేంద్ర కు కష్టకాలం దాపురించింది. సీఎం జగన్, మంత్రులు, అధికారులు శారదా పీఠానికి రావడం మానేశారు.

కొత్త స్వామి విజయకుమార్ చాలా విషయాలలో తలలో నాలుకలాగా మారడంతో స్వరూపానందేంద్ర కు తీరని మనోవేదన మిగిలింది. దాంతో అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటుచేసుకున్న సమయంలో కూడా జగన్ ప్రభుత్వానికే పూర్తి మద్దతు ప్రకటించిన స్వరూపానందేంద్ర ఇప్పుడు తన స్థాయికి ముప్పు రావడంతో విమర్శలు గుప్పిస్తున్నారు. భక్తుల మీద ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు.

అసలు గర్భాలయం చూస్తే భయమేస్తుంది. గర్భాలయంలో ఏ మాత్రం ఆచారం, సంప్రదాయం లేకుండా అయిపోయింది. సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పొచ్చు. భక్తులు పడుతున్న ఇబ్బందులు చూస్తే కళ్లలో నీళ్లు వస్తున్నాయి.

అసలు ఈరోజు నేను ఎందుకు దర్శనానికి వచ్చానా? అని అనిపించింది. కొండ కింది నుంచి పైవరకు భక్తుల రద్దీ ఉన్న ఎలాంటి మూమెంట్ లేదు. వీఐపీల  దర్శనమేమిటి? ఇక్కడ ఉంది పేదల  దేవుడు.. ధనవంతులు దేవుడు కాదు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించింది’’ అని స్వామి స్వరూపానందేంద్ర జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Related posts

న్యూడ్ వీడియో కాల్.. ఆపై బెదిరింపులు

Satyam NEWS

వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన డాక్టర్ కరుణాకర్

Satyam NEWS

తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవా టిక్కెట్ల ధరలు పెంచద్దు

Bhavani

Leave a Comment