26.7 C
Hyderabad
May 3, 2024 08: 49 AM
Slider మహబూబ్ నగర్

నూతన వ్యవసాయ విధానంతో రైతుల ఆర్థికాభివృద్ధి

#MLA Beeram Harshavardhanreddy

రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్, రైతుల పంటలకు పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువుల పంపిణితో పాటు రైతు భీమాను అందిస్తు రైతులకు భరోసగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన రెడ్డి అన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన వ్యవసాయ విధానం రైతులకు లాభాదాయకంగా మారుతుందన్నారు. అధిక డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగుచేయాలన్నారు. అధిక లాభాలు పొందే పంటల పట్ల రైతులు మొగ్గుచూపాలన్నారు.

ఈ రోజు పెద్దకొత్తపల్లి మండలం కల్వకొల్ గ్రామంలో వానాకాలం 2020 వ్యవసాయ కార్యచరణ, నూతన వ్యవసాయ విధానంపై రైతులకు  ఏర్పాటు చేసిన అవగాహన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రైతుల కష్టం లాభాదాయకం కావాలని రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో వ్యవసాయం సాగాలాని ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేసిందన్నారు.

దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయని రైతు సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి దేశానికి ఆదర్శవంత సిఎంగా కేసీఆర్ నిలిచారన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన విధంగా  సాగు చేయాలన్నారు. ఈ అవగాహన సదస్సులో ప్రజాప్రతినిధులు, అధికారులు,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

OTC Green Tea Weight Loss Pills Vitamin Shoppe Most Effective Weight Loss Pill For Women Over 50

Bhavani

సిద్ధూతో వాగ్యుద్ధం.. రాజీనామాకు సీఎం చన్నీ సిద్ధం

Sub Editor

డబ్బులకు బదులు గోధుమలు…తాలిబన్ల కొత్త నిర్ణయం

Sub Editor

Leave a Comment