30.2 C
Hyderabad
October 13, 2024 17: 10 PM
Slider ఆంధ్రప్రదేశ్

గ్రీన్ రెవెల్యూషన్: పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష

pawan deeksha

ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, జగన్ రెడ్డి సర్కారు వైఖరిపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభమైంది. కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఐ.టి.ఐ పక్కన ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి ఉదయం 8 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.

మహిళలు హారతులు పట్టగా రైతులు పూల మాల వేసి ఆయనను వేదిక మీదకు ఆహ్వానించారు. రైతు దీక్షకు సంకేతంగా రైతులు, పార్టీ నాయకులు పచ్చని కండువాను కప్పి, వరి కంకులు బహుకరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనసైనికులు, నాయకులు, రైతులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చున్నారు.

ఆయనతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, తూర్పు గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు  చెందిన నాయకులు, రైతు సంఘాల నేతలు వేదికపై దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. మరో వైపు జనసేనాని దీక్షకు జన సైనికులు, రైతులు భారీగా తరలి వచ్చారు. 

రాష్ట్ర నలుమూలల  నుంచి లక్షలాది జన సైనికులు కాకినాడ చేరుకొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగబాబు కూడా పాల్గొన్నారు.

Related posts

విజిబుల్ పోలీసింగుతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

Satyam NEWS

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతిష్ట కాపాడేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

Satyam NEWS

ప్రైవేట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment