విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి గ్రీన్ పార్టనర్ గా పర్యావరణ పరిరక్షణ భాగస్వామిగా SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థను గుర్తిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి ఎం సుందరవల్లి తెలిపారు. విశ్వవిద్యాలయానికి ఇటీవల లభించిన న్యాక్ ఏ గ్రేడ్ కు SEIL సి ఎస్ ఆర్ పర్యావరణహిత కార్యక్రమాలు ఎంతో దోహదం చేసినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున చెట్ల పెంపకం అలాగే వాటి పరిరక్షణతో పాటు సోలార్ సిస్టమ్స్ సోలార్ హీటర్లను SEIL సంస్థ అందించింది అని అందుకు వారికి విశ్వవిద్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఉపకులపతి అన్నారు. విశ్వవిద్యాలయానికి SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ అందిస్తున్న సహకారానికి గుర్తుగా కంపెనీ సీ ఈ ఓ అయిన రాఘవ్ త్రివేది ని రిజిస్త్రార్ ఆచార్య పి రామచంద్ర రెడ్డి సహ ఆధ్యాపకుల సమక్షంలో ఉపకులపతి ఘనంగా షాల్ మోమెంటుతో సన్మానించారు.
ఈ సందర్భంగా రాఘవ్ త్రివేది మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి పర్యావరణ పరిరక్షణ పరమైన కార్యక్రమాల్లో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అలాగే ఫ్లై యాష్ సహా అవకాశమున్న పలు అంశాలలో పరిశోధనలు చేసేందుకు సహకారము అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు తదనంతరం విశ్వవిద్యాలయం ఇండస్ట్రీ పరస్పర వడంబడికకు చిహ్నంగా రెండు కల్పవృక్ష మొక్కలను సీ ఈ ఓ, వి సి నాటారు. వి సి సుందరవల్లి రిజిస్త్రార్, అధ్యాపకులు సీఈఓ రాఘవ్ త్రివేది కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సి ఈ ఓ రాఘవ త్రివేది SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా సందర్శించి పరిశీలించారు.