23.7 C
Hyderabad
May 8, 2024 05: 23 AM
Slider నిజామాబాద్

నూతన రెవిన్యూ చట్టంలో లోపాలున్నాయి

#TammineniVeerabhadram

సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన నూతన రెవిన్యూ చట్టాన్ని సీపీఎం పార్టీ తరపున స్వాగతిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చట్టంలో కొన్ని లోపాలున్నాయని తమ్మినేని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలపై ఐలమ్మ పోరాడిందన్నారు. ఆమె స్పూర్తితో మేము పోరాటాలకు సిద్ధం అవుతున్నామన్నారు.

చట్టాన్ని స్వాగతిస్తున్నామంటూనే …

సీఎం కేసీఆర్ తెచ్చిన నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని చెప్తూనే నూతన చట్టంలో ఉన్న లోపాలను ఎత్తిచూపారు తమ్మినేని. కొత్త చట్టంలో కౌలు రైతుల ఊసెత్తలేదన్న ఆయన గతంలో ఆర్టికల్ 26 ద్వారా భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా పత్రాలు ఇచ్చేవారని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఈ చట్టంలో కౌలు రైతులు హక్కు కోల్పోతున్నారని, రైతుబంధు సమయంలో కూడా కౌలు రైతులను గుర్తించలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి కౌలు రైతులకు అన్యాయం జరుగుతూనే ఉందని విమర్శించారు.

కొత్త చట్టం అంటూ ఊదరగొట్టారు

గత కొద్దికాలంగా రెవిన్యూ సంస్కరణలు తెస్తామంటూ సీఎం కేసీఆర్ ఉదరగొడుతూ వచ్చారని ఎద్దేవా చేసారు.  నూతన చట్టంలో రెవిన్యూ లోపాలు, కుంభకోణాల జోలికి వెళ్ళలేదని దుయ్యబట్టారు. అలాగే ఆలయ భూములు, వక్ఫ్ భూములు, మిగులు భూములు, అటవిభూములు వేలు, లక్షల ఎకరాల అన్యాక్రాంతం అయ్యాయని, వీటిని బయటకు తెచ్చేలా సమగ్ర సర్వే జరగాలని సూచించారు.

కొత్తగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు భూ సర్వే చేస్తామని చెప్పి ఆరు సంవత్సరాలు గడిచిన చేయలేదని తెలిపారు. అవినీతి, అక్రమ అధికారులు ఉంటే వారిపై దావా వేయడానికి రైతులు కోర్టుకు వెళ్లే అవకాశాన్ని ఈ చట్టం తీసేసిందన్నారు. వారసత్వ భూములకు ఫీజు కట్టాలని చట్టంలో తెచ్చారని, ఫీజు భారీగా ఉంటుంది కాబట్టి ఇది రైతులకు భారంగా మారుతుందన్నారు.

ఎల్ఆర్ఎస్ తో సామాన్యులకు ఇబ్బందులు

ఎల్ఆర్ఎస్ జీవో 111 ప్రకారం అక్రమార్కుల జోలికి వెళ్లడం లేదని, ఎకరాల కొద్దీ ఆక్రమించిన వారిని వదిలి చిన్న చిన్న ప్లాట్లను చేసుకున్న వారి జోలికి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాన్యుల నుంచి భూమి రేటు ఎంత ఉందో అంత వసూలు చేయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.

Related posts

బైంస అల్లర్ల బాధితులకు మంత్రాలయ పీఠం బాసట

Satyam NEWS

నీతులు చెప్పే చిదంబరం ఏం చేశాడు?

Satyam NEWS

రానా ద‌గ్గుబాటి లాంచ్ చేసిన ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ టైటిల్ పోస్ట‌ర్‌

Satyam NEWS

Leave a Comment