28.7 C
Hyderabad
May 6, 2024 00: 24 AM
Slider ముఖ్యంశాలు

అందుబాటులోకి రానున్న కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు

#bus

ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారి సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో యాజమాన్యం నూతన బస్సులను కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డిలక్స్,  16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. ఈ బస్సులన్నీ24 మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించడం జరిగింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయం కల్పించడం జరుగుతుంది. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూం నకు అనుసంధానం చేయడం జరుగుతుంది.

ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూం నకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. అలాగే, ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్ డీఏఎస్) ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగిన అలారం ఆటోమెటిక్గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్ డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

Related posts

రాజకీయ, ఆర్థిక సంక్షోభం… విశ్వవ్యాప్తంగా అలజడి

Bhavani

నేరం జరిగిన ప్రాంతానికి పోలీసులు తక్షణమే చేరాలి

Satyam NEWS

కొల్లాపూర్ లో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment