37.2 C
Hyderabad
May 2, 2024 12: 43 PM
Slider జాతీయం

కంఝవాలా కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

#kanjhanwalacase

స్కూటీపై వస్తున్న ఒక యువతిని తాగిన మత్తులో ఢీకొట్టి 12 కిలోమీటర్ల పాటు ఆమె శరీరాన్ని లాక్కెళ్లి ఆమె దారుణ మరణానికి కారణమైన సంఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్ 31-జనవరి 1 మధ్య రాత్రి సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కంఝవాలా రోడ్డులో ఈ సంఘటన జరిగింది. కంఝవాలా కేసుగా పేరు పొందిన ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆరుగురు యువకులు తాగిన మత్తులో ఉండి ఈ కిరాతక సంఘటనకు పాల్పడ్డారు. ఇప్పటి వరకూ ఇది ఒక యాక్సిడెంట్ గానే భావిస్తుండగా నిందితులు కావాలనే ఈ ఘటనకు పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. తమ కారు చక్రాల మధ్య ఓ యువతి ఇరుక్కుపోయిందని నిందితులకు తెలిసినా, ఆ మహిళను కాపాడేందుకు ప్రయత్నించలేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.

సోమవారం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఈ సమాచారాన్ని కోర్టుకు తెలిపారు. వారి వాహనం కింద ఒక యువతి ఇరుక్కుపోయిందని తెలిసిన తర్వాత కూడా వారు కారును నడుపుతూనే ఉన్నారని పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఆరుగురు నిందితులు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో మరో నిందితుడు అశుతోష్‌ బెయిల్‌పై మంగళవారం విచారణ జరగనుంది. ఇంత వరకూ తాము కారు దిగలేదని నిందితులు చెబుతున్నారు.

అయితే సీసీటీవీ ఫుటేజీలో వారు కిందకు దిగి, ఏదో ఇరుక్కుపోయిందని చూసినా, ఆ తర్వాత కూడా డ్రైవ్ చేస్తూనే ఉన్నట్టు తెలిసింది. ఈ కేసులో 20 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. అంజలి సింగ్ (20) స్కూటీని కారు ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాగడంతో, ఆమె మరణించింది.

ఆమె మృతదేహం డిసెంబర్ 31-జనవరి 1 మధ్య రాత్రి కంఝవాలాలోని రోడ్డుపై కనిపించింది. సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్‌లో దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), క్రిషన్ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్‌లపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నరహత్య సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మరణానికి కారణమైంది.

Related posts

ఆలయానికి, సంఘ భవనానికి భూమి పూజ చేసిన మంత్రి

Satyam NEWS

11 నుంచి శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు

Sub Editor

ఐక్యూ చిత్రం ఆడియో విడుదల

Satyam NEWS

Leave a Comment