31.2 C
Hyderabad
May 2, 2024 23: 27 PM
Slider విజయనగరం

నూతన సంవత్సరంలో నిర్దేశించుకొన్న లక్ష్యాలను చేరుకోవాలి

#depika

కొత్త ఏడాది వేడుకలు విజయనగరం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఎఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం. సోల్మన్, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, దిశ డిఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు, డిటిసి డిఎస్పీ వీర కుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, పలువురు నగర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఇతర శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, పలువురు సిఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది జిల్లా ఎస్పీ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ ఈ కొత్త ఏడాది లో అందరికీ మంచి శుభాలు జరగాలని, పోలీసుశాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలుకు చేరుకొనే విధంగా సమర్ధవంతంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని, ప్రజలందరికీ మంచి సేవలందిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే విధంగా పని చేయాలన్నారు. విజయనగరం జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. పోలీసు అధికారులు, ప్రజలు, ఇతర కుటుంబ సభ్యులు ఈ నూతన సంవత్సరంలో క్షేమంగా, సంతోషంగా ఉంటూ నిర్దేశించుకొన్న లక్ష్యాలను చేరుకొని, విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలంతా శాంతియుత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతల సమస్యలు లేకుండా జీవించే విధంగా పోలీసులు చేపట్టే చర్యలకు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. అంతేకాకుండా, జిల్లాను అభివృద్ధి పధంలో నడిపేందుకు బాధ్యత కలిగిన పౌరునిగా ప్రతీ ఒక్కరూ వ్యవహరించాలని ప్రజలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక కోరారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, కేక్  అందజేసారు.

ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం. సోల్మన్, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, దిశ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు, డీటీసీ డీఎస్పీ వీర కుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, డీపీఓ ఎఓ వెంకట రమణ, కార్యాలయ పర్యవేక్షకులు, పలువురు సిఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రాజధాని శిలాఫలకం మీ రాక కోసం ఎదురు చూస్తుంది

Bhavani

మర్కజ్ వార్తలతో బెంబేలెత్తిన మల్లేపల్లి వాసులు

Satyam NEWS

నామినేషన్ దాఖలు చేసిన బి ఆర్ ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

Leave a Comment