39.2 C
Hyderabad
April 28, 2024 12: 47 PM
Slider తూర్పుగోదావరి

ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద బారులు తీరిన రైతన్న

#eastgodavari

ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడు లో ది. భువనేశ్వరి సహకార పరపతి సంఘం వద్ద గల రైతు భరోసా కేంద్రం వద్ద ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. ఉడుమూడి రైతు భరోసా కేంద్రం పరిధికి సంబంధించి పదిహేను వందల ఎకరాల ఆయకట్టు ఉండగా రెండు వేల బస్తాల వరకు ఎరువులు అవసరం అవుతాయి. అయితే నాలుగు వందల బస్తాలు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారు.  అరకొరగా ఎరువులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని ఎరువులు ఇచ్చిఅధికారులు, ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి  కురసాల కన్నబాబు మాత్రం ఎరువులు పుష్కలంగా ఉన్నాయంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు గాని రైతులకు మాత్రం ఎరువులు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు కావాల్సిన ఎరువులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని అధికారులను వారు కోరుతున్నారు.

Related posts

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

విద్యాసంస్థల్లో బియ్యం సరిగా ఉంచకపోతే అధికారులపై కఠిన చర్యలు

Satyam NEWS

భారత విప్లవ కెరటం భగత్ సింగ్ పుస్తకావిష్కరణ

Satyam NEWS

Leave a Comment