42.2 C
Hyderabad
April 30, 2024 18: 45 PM
Slider ఆదిలాబాద్

గుడ్ గవర్నెన్స్:పోలీసుల పట్ల గౌరవం పెంచేందుకు చర్యలు

nirmal sp 17

ప్రజల సమస్యలు ఓపిగ్గా విని వాటిని పరిష్కరించి పోలీసులంటే గౌరవం పెంచుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి శశిధర్ రాజు అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదుదారులు హాజరై సమస్యలను ఎస్పీకి తెలియ చేశారు. సంబంధిత అర్జీలను ఆయనకు సమర్పించారు.

వారిని ఎస్పీ అప్యాయంగా పలకరించి ఓపిగ్గా సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు పోలీసు అండగా ఉండాలని వారితో  స్నేహభావంతో మసలుకోవాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవలంబించాలని, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని  చట్టరీత్యా చర్యలుంటాయని సూచించారు.

జిల్లాలో విజుబుల్ పోలీసింగ్ కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాత్రి సమయంలో అత్యధికంగా పోలీసులను మొహరించే నేరాలను అరికడుతున్నారు. ప్రజలకు అవసరమైనపుడు పోలీసు స్పందనపైనే ప్రదానంగా దృష్టిసారిస్తానని తెలిపారు. పోలీసుల సహాయం కావాలనుకున్నవారు పోలీసు స్టేషన్ లో నిర్భయంగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని దృష్టికి వస్తే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేయాలి లేదా జిల్లా వాట్సప్ నెం.8333986939కు సమాచారం తెలియజేయాలని కోరారు.

Related posts

నత్తనడకన సిద్ధవటం హైలేవల్ వంతెన మరమ్మతు పనులు…

Satyam NEWS

పేరు మార్పు మంచి కాదు: హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉంచాలి

Satyam NEWS

అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు!l

Bhavani

Leave a Comment