27.7 C
Hyderabad
April 26, 2024 06: 21 AM
Slider కడప

నత్తనడకన సిద్ధవటం హైలేవల్ వంతెన మరమ్మతు పనులు…

#siddavatam

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం హైలేవల్ వంతెన మరమ్మతు పనులు మూడు నెలలుగా నత్త నడకన సాగుతున్నాయి.హై లేవల్ వంతెన పై ఇరువైపులా ఫుట్ పాత్ దెబ్బతింది.రోడ్డు పూర్తిగా దెబ్బతింది.ఇందుకు గాను మరమ్మతుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 85 లక్ష రూపాయలు నిధులు మంజూరు చేసింది.

దాదాపు మూడు నెలల క్రితం గుత్తే దారు పనులు మొదలు పెట్టారు.మరమ్మతు ల కోసం హైలెవల్ వంతెన మూసివేసారు.ఇంకా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.దీనితో కడప నుంచి బద్వేలు మీదుగా వెళ్లే వాహనాలు పాత వంతెనపై నుంచి పంపుతున్నారు.ఇటీవల భారీ వర్షాలకు సిద్దవటం పెన్నానదిలో వరద నీరు వచ్చి చేరుతోంది.

అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.కాజ్ వే పై నీరు చేరితే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురువ్వుతాయి. కాగా మరమ్మతులు నాసిరకంగా జరుగుతు న్నాయని క్యూరింగ్ జరిగినచోట సరిగా లేదనే ఆరోపణలు ఉన్నాయి.మరమ్మతులు నాణ్యంగా చేసి,లో లేవల్ కాజ్ వే పైకి వరద నీరు చేరక ముందే త్వరితగతిన హై లేవల్ వంతెన పునః ప్రారంభం చేయాలని పలువురు కోరుతున్నారు.

Related posts

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ ప్రీరిలీజ్ 18న

Satyam NEWS

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి

Satyam NEWS

వరంగల్ లో అంతర్జాతీయ అంధుల దినోత్సవం

Satyam NEWS

Leave a Comment