38.2 C
Hyderabad
April 29, 2024 22: 14 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఓవైపు నివ‌ర్‌, మ‌రోవైపు గ‌తి

Cyclone

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రానున్న24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా.. ఆ తర్వాత 24 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.

ఈ తుఫాన్‌కు నివర్‌ అని పేరు పెట్టారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి.. ఈనెల 25న మధ్యాహ్నం పుదుచ్చేరి-మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అనేకచోట్ల ఉరుములతో వర్షాలు పడ్డాయి. ఇక 25, 26న భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు చిత్తూరు, నెల్లూరు నుంచి గుంటూరు వరకు వర్షాలు పడతాయంటున్నారు. తీరంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. మత్స్యకారులు ఈనెల 25 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని.. ఎవరైనా వెళ్లుంటే వెంటనే వెనక్కి వచ్చేయాలని అధికారులు సూచించారు.

ఓవైపు నివర్ తుఫాన్ భయపెడుతుంటే.. ఇటు అరేబియా సముద్రంలోని గతి తుఫాన్ మనవైపు కదులుతోంది. ప్రస్తుతం ఇది సొకోట్రా(యెమన్‌)కు దక్షిణాన 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. పశ్చిమ-నైరుతి దిశగా కదులుతోంది. ఒకవేళ భారత్‌వైపు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ మొదలైంది.

Related posts

కరీనా కపూర్ ధరించిన ఈ కరోనా మాస్క్ ధర ఎంత?

Satyam NEWS

45 ఏళ్లు దాటిన వారికి రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్

Satyam NEWS

కాబూల్‌ లో మెథామ్‌ విక్రయం..

Sub Editor

Leave a Comment